ఎవరినైనా ఎదిరించే దమ్ము ధైర్యం రవితేజ సొంతం
ఎవరినైనా ఎదిరించే దమ్ము ధైర్యం ఉన్న ఓ యువకుడి కధే 'వీర'. ఈ పాత్రలో రవితేజ పూర్తిగా ఒదిగిపోయారు. రవితేజలోని ఓ కొత్త కోణాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం.దాంతోపాటు రవితేజ తరహా ఎంటర్టైన్మెంట్ పూర్తిగా ఉంటుంది అంటున్నారు దర్శకుడు రమేష్ వర్మ.గతంలో రైడ్ చిత్రం డైరక్ట్ చేసిన రమేష్ వర్మ తాజా చిత్రం 'వీర'. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం గోదావరి తీరాన జరుగుతోంది. ఈ చిత్రంలో రవితేజ పాత్ర ఇలా చెప్పుకొచ్చారు. అలాగే రవితేజ ఏం చేసినా చిరిగి చేటంతై పేటంతవుతుంది. ఎవరేమనుకొన్నా లెక్క చేయడు. మహా మొండి. ఇతని తెగింపు చూసే కబడ్డీ చిట్టి మనసు పారేసుకొంది. మరి హీరో మనసిచ్చాడా లేదా అసలేం జరిగింది అన్నది కథ అన్నారు.
అలాగే చిత్రం టైటిల్ వీర కు తగ్గట్టే హీరో పాత్రలో వీరత్వాన్ని చూపిస్తున్నాం. ప్రస్తుతం రవితేజ, సునీల్ తదితరులపై వచ్చే కొన్ని కీలక సన్నివేశాల షూట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ పోషిస్తున్న కబడ్డీ చిట్టి పాత్ర హైలెట్ గా నిలుస్తుందంటున్నారు. తాప్సీతో లవ్ సీన్స్ బాగా పండుతాయని చెప్తున్నారు. తాప్సీ ఐటీ స్టూడెంట్ గా అలరిస్తుంది. కిక్ శ్యామ్ పోలీస్ ఆపీసర్ గానూ, అతని భార్యగా శ్రేదేవి చేస్తున్న ఈ చిత్రంలో నాగబాబు ఓ కీలకమైన పాత్రలో కనిపిస్తాడు. ఈ చిత్రాన్ని గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవలే అరకులో ఫైటింగ్ సీన్స్ చిత్రీకరించారు. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సంగీతం: తమన్.


Click it and Unblock the Notifications











