పీక పిసికి చంపేస్తా.. బట్టలూడదీసి పరిగెత్తిస్తా... పవన్ పేరు లాగుతూ వర్మ సంచలన ట్వీట్
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు తీసి.. ట్రెండ్ సెట్టింగ్ దర్శకుడిగా మారాడు. అయితే ప్రస్తుతం ఆయన తీసే సినిమాలు ప్రేక్షకులకు ఎక్కట్లేదు. నా ఇష్టం అంటూ.. నా రాతలు అన్నట్లుగా ఇష్టమొచ్చిన సినిమాలు తీసి జనాల మీదకు వదిలేస్తున్నాడు. కానీ ఆ సినిమాలు మాత్రం బోల్తా కొడుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఇక సమాజంలోని ఏదో ఒక విషయంపై స్పందిస్తూ అప్పుడప్పుడు ట్విట్టర్లో హడావిడి చేస్తూ ఉంటారు ఆర్జీవీ. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ గురించి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే...
పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు: పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఓ వైపు సినిమాలతో బిజీ బిజీగా గడపుతూనే.. మరోవైపు ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన వారాహి విజయ యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. కాకినాడలో జనసేన వారాహి విజయ యాత్ర కొనసాగుతుండగా.. ఆయన అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నాడు. అయితే అక్కడ ఏపీ రాజకీయాలపై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్: అయితే పవన్ వ్యాఖ్యలపై దర్శఖుడు రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. అందులో ఏం ఉందంటే... ఆయన రాజకీయ క్యాంపైన్లు చివరికి ఇక్కడికి చేరాయి. తననుకున్న దాన్ని ఎవరు వ్యతిరేకించినా... అధికారంలో వస్తే పీక పిసికేసి చంపేస్తా, బట్టలూడదీసి పరిగెత్తిస్తా, చర్మం వలిచేస్తా.. వంటి హింసాత్మికమైన బెదిరింపులు చేస్తారంటూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఇలా ప్రపంచచరిత్రలో ఏ దేశంలో ఎవరూ అనరు.. హిట్లర్, సద్దాం, కిం జొంగ్ ఉన్ తో సహా.. అంటూ ట్విట్టర్ లో వర్మ రాసుకొచ్చారు.
పవన్ కామెంట్స్ కు ఆర్జీవీ కౌంటర్: ఇంకో విషయం ఏమిటంటే... అధికారంలోకి వస్తే.. నరికేస్తాను.. అంటే.. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అలా చేయచ్చని చెప్పడమా అని వర్మ.. పవన్ ను ఉద్దేశించి ప్రశ్నించాడు. ఏది ఏమైనా ఒక ప్రజాస్వామ్య దేశంలో తన అభిమానులకు డైరెక్ట్ గా ఇంత బ్రూతల్ వయోలెన్స్ ను ప్రభోదించడం తీవ్రవాదం కన్నా ప్రమాదకరమైన ఆటవిక మనస్తత్వం అంటూ ట్విట్ చేశాడు.

వైరల్ అవుతున్న ఆర్జీవీ ట్వీట్: ఇలాంటి హింసను ఎంకరేజ్ చేస్తూ అరుస్తూ ఉంటే... ఆ మీటింగులకు వచ్చే ఆ యువకులు భవిషత్తులో ఏమ్ అవ్వాలి అనుకుంటున్నారు పవన్ కల్యాణ్ కే తెలియాలి అని వర్మ సెటైర్ వేశాడు. పైగా ఈ వయోలేంట్ బెదిరింపులన్ని లైవ్ మీడియా ముందు ప్రజలందరూ లివింగ్ రూమ్స్ లో పిల్లల తో పాటు టీవీ చూస్తుండగా అవసరమా అని ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... పవన్ అభిమానులు ఆర్జీవీపై మండిపడుతున్నారు.



Click it and Unblock the Notifications











