'13బి' లో డైరక్టర్ రవిబాబు ఏం చేస్తాడు?
హీరో ప్యామిలీ కొత్తగా 13బి అనే ప్లాట్ కొనుక్కుని మారతారు. అక్కడికి వెళ్లాక టీవీలో ఓ సీరియల్ ప్రారంభమవుతుంది. అలాగే రెగ్యులర్ గా ఇష్టపడి చూసే టీవీ సీరియల్లో జరిగే సన్నివేశాలు జెరాక్స్ కాపీలా వాళ్లు లైఫ్ లో జరిగిపోతూంటాయి. అంతేగాక ఆ టీవీ సీరియల్ కేవలం వాళ్ళ ఇంట్లోనే వస్తోందని హీరో కి తెలిసింది..అప్పుడు ఏం చేయాలి..ఎవరికి చెప్పుకోవాలి..ఆ సమస్యనుండి ఎలా తప్పించుకోవాలి అనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. మాధవన్, నీతూచంద్ర హీరో హీరోయిన్లుగా హిందీ, తమిళంలో వచ్చి విజయవంతమైన '13 బి'చిత్రంలో మెయిన్ పాయింట్ ఇది.ఇది ఇప్పుడా సినిమా పదమూడు పేరుతో తెలుగులోకి అనువాదమవుతోంది.
అనసూయ చిత్రంలో తన నటనతో భయపెట్టి అందరి మన్ననలు అందుకున్న దర్శకుడు రవిబాబు ఈ ధ్రిల్లర్ లో కనిపించనున్నాడు. తెలుగు వెర్షన్ లో ఆయన అతిధి పాత్రలో కనిపిస్తారు.చిత్రాన్ని బిగ్ పిక్చర్ సంస్ధ వారు 'పదమూడు' పేరుతో తెలుగులోకి అనువదించింది అందిస్తున్నారు. రవిబాబు పాత్రని షూట్ చేసి ప్రత్యేకంగా కలిపారని సమచారం.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవిబాబు మాట్లాడుతూ - ఈ చిత్రంలో నేను పోలీసాఫీసర్‌గా నటించాను. ఈ చిత్ర దర్శకుడు విక్రమ్ మంచి ప్రతిభావంతుడు. హారర్, సస్పెన్స్ చిత్రాలు తీసే దర్శకులకు ఈ సినిమా ఓ రిఫరెన్స్‌లా వుపయోగపడుతుంది. ఓ మంచి కుటుంబకథకు సస్పెన్స్ అంశాలు జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తమిళంలో మాదిరిగా తెలుగులో కూడా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను' అన్నారు. నవంబర్ 6న విడుదల ఈ చిత్రం కానుంది.


Click it and Unblock the Notifications











