దర్శకుడు రవి చావలి తర్వాతి చిత్రం ‘సూపర్ స్కెచ్’
బాలకృష్ణ తో శ్రీమన్నారాయణ, జగపతి బాబుతో సామాన్యుడు, సుమంత్ తో దగ్గరగా దూరంగా, నితిన్ తో విక్టరీ, ఆదితో ప్యార్ మే పడిపోయా, ది ఎండ్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు రవి చావలి త్వరలో సూపర్ స్కెచ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 'జస్టిస్ ఈజ్ ఇన్ యాక్షన్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మైండ్ గేమ్ అనే పాయింట్‌ను హైలైట్ చేస్తూ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.
నర్సింగ్, ఇంద్ర, సమీర్ దత్, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగీ, విదేశీ నటులు సోఫియా, గ్యారీ టాన్ టోనీ (ఇంగ్లాండ్) తదితరులు ఇందులో కీలక పాత్రధారులు. యు అండ్ ఐ- ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ సహకారంతో శ్రీ శుక్ర క్రియేషన్స్ ప్రొడక్షన్స్ పై బలరామ్ మక్కల నిర్మిస్తున్నారు.

ఈ సినిమా గురించి బలరామ్ మక్కల మాట్లాడుతూ మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రమిది. సూపర్ స్కెచ్ అనే టైటిల్ కథకు చక్కగా సరిపోతుంది. అన్నీ పనులూ పూర్తయ్యాయి. తొలి కాపీ సిద్ధమైంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లరిది. ప్రేక్షకులకు తప్పక నచ్చుతుంది. రవి చావలి దర్శకత్వంలో మరో హిట్ చిత్రం ఖాయం.'' అన్నారు.
జూన్ 29 న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి ఛాయాగ్రహణం, జునైద్ ఎడిటింగ్, కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు. సుభాష్, నారాయణ్, ఇంజపూరి, ప్రియాంక సాహిత్యం సమకూర్చారు.


Click it and Unblock the Notifications











