ప్రముఖ బాలీవుడ్ దర్శకడు రవి చోప్రా కన్నుమూత
ముంబై: ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రవి చోప్రా కన్నుమూసారు. ముంబైలోని బీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు కన్నుమూసారు. ఆయన మరణ వార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

‘రవి చోప్రా బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మరణించారు. ఆయన అంత్యక్రియలు గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నిర్వహిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు' తెలిపారు. రవి చోప్పాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
రవిచోప్రా వయసు 68 సంవత్సరాలు. ఆయన బాలీవుడ్లో తెరకెక్కించిన ‘భాగబన్' చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. గత కొన్నాల్లుగా ఊపిరి తిత్తుల సంబంధ వ్యాధులతో బాధ పడుతున్న రవి చోప్రా బీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దివంగత బాలీవుడ్ ప్రముఖుడు బి.ఆర్. చోప్రా కుమారుడైన రవి చోప్రా....‘ది బర్నింగ్ ట్రైన్, ఆజ్ కి ఆవాజ్, బాబుల్ అనే చిత్రాలను తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











