సీడీ ఇచ్చి చూడమని చెప్పా.. అంతమందిలో ముద్దు పెట్టుకోవడం.. హీరోయిన్‌పై డైరెక్టర్ కామెంట్స్!

మీటూ ఉద్యమ ధాటికి సినీప్రముఖులు జాతకాలాన్ని బయట పడుతున్నాయి. బాలీవుడ్ లో అయితే మీటూ ఉద్యమం పెను సంచలనం సృష్టిస్తోంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన నటీమణులంతా తమకు జరిగిన సంఘటనలని బయట పెడుతున్నారు. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్లు, నటులపై తీవ్రమైన ఆరోపణలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ సంజన కూడా దర్శకుడు రవి శ్రీవత్సపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. సంజన ఆరోపణలపై రవి శ్రీవత్స స్పందించారు.

ఒక ముద్దు అని చెప్పి

ఒక ముద్దు అని చెప్పి

గండ హెండతి చిత్రంతో ముద్దుల పేరుతో దర్శకుడు తనని వేధించాడని సంజన ఆరోపించింది. ఏ చిత్రంలో కేవలం ఒకే ముద్దు సన్నివేశం ఉంటుందని చెప్పి చివరకు 30 ముద్దులు పెట్టించాడని సంజన ఆరోపించింది. దర్శకుడు కూడా తనకు ముద్దులు పట్టేందుకు ప్రయత్నించాడని సంజన తీవ్రమైన ఆరోపణలు చేసింది.

ఎలా ముద్దు పెట్టగలను

ఎలా ముద్దు పెట్టగలను

షూటింగ్ లో అంత మంది మధ్య హీరోయిన్ కి తాను ఎలా ముద్దు పెట్టగలను అని దర్శకుడు శ్రీవత్స ప్రశ్నించారు. సంజన కావాలనే తనపై అక్కసుతో ఆరోపణలు చేస్తోందని రవి శ్రీవత్స అన్నారు. తాను సినిమా చేసింది ముద్దులు పెట్టడానికి కాదని బదులిచ్చారు.

చూడమని సీడీ ఇచ్చా

చూడమని సీడీ ఇచ్చా

గండ హెండతి చిత్రం మర్డర్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోందని ఒకటికి రెండు సార్లు ఆమెతో చర్చించిన తరువాతే సినిమాలోకి తీసుకున్నాము. మర్డర్ చిత్రాన్ని చూడమని ఆమెకు సీడీ కూడా ఇచ్చానని దర్శకుడు పేర్కొన్నాడు. సంజన పబ్లిసిటీ కోసమే ఆరోపణలు చేస్తున్నట్లు ఉందని రవి శ్రీవత్స అన్నారు.

చట్టపరమైన చర్యలు

చట్టపరమైన చర్యలు

తనకు శుక్రవారంలోగా సంజన క్షమాపణలు చెప్పాలి. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని హెచ్చరించారు. మీటూ ఉద్యమాన్ని కొందరు పబ్లిసిటీ కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X