Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
సీక్రెట్‌గా సింగర్‌తో యంగ్ డైరెక్టర్ పెళ్లి.. ఐదేళ్ల డేటింగ్ బంధానికి తెర
క్షణం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ రవికాంత్ పేరెపు ఓ ఇంటివాడయ్యారు. గత 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఆయన తన ప్రియురాలిని శనివారం చెన్నైలో వివాహం చేసుకొన్నారు. తాజాగా కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రంతో ఘనవిజయం అందుకొన్న రవికాంత్ లాక్డౌన్ కారణంగా తన పెళ్లిని నిరాడంబరంగా చేసుకోవడం గమనార్హం. ఈ వివాహానికి అతికొద్ది మంది సినీ ప్రముఖులు హాజరైనట్టుగా తెలిసింది. ఈ వివాహం గురించి మరిన్నీ విషయాలు.
చెన్నైలో నిరాడంబరంగా పెళ్లి
దర్శకుడు రవికాంత్, గాయని వీణా ఘంటశాల గత ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. కెరీర్‌పై దృష్టిపెట్టిన ఈ ఇద్దరు కొద్దికాలంగా పెళ్లిని వాయిదా వేసుకొంటు వస్తున్నట్టు సన్నిహితులు తెలిపారు. తాజాగా వారి పెద్దలు కూడా రవికాంత్, వీణా ప్రేమకు అంగీకారం తెలపడంతో పెళ్లికి ముహుర్తాలు నిర్ణయించారు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా ఈ పెళ్లిని గుట్టుచప్పుడు కాకుండా అతికొద్ది మంది ఫ్యామిలీ, స్నేహితుల సమక్షంలో జరిపించారు.
వీణ, రవికాంత్ గురించి
వీణా ఘంటశాల విషయానికి వస్తే టాలీవుడ్లో ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకొంటున్న గాయని. ఈమె దిగ్గజ గాయకుడు ఘంటశాలకు మనువరాలు. ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్టుగా, గాయనిగా కొనసాగుతున్నారు. ఇక రవికాంత్ పేరెపు విషయానికి వస్తే క్షణం, కృష్ణ అండ్ లీలా సినిమాలతో మంచి విజయాలను అందుకొన్నారు. ప్రస్తుతం రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
పెళ్లిపై రవికాంత్ ఎమోషనల్‌గా
రవికాంత్ తన పెళ్లిపై స్పందిస్తూ.. కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా షూటింగ్ సమయంలో మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నాం. మా బంధాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలని భావించినందున పెళ్లి చేసుకొన్నాం. నా సినిమా మధ్యలో ఆగిపోయినప్పుడు నేను ఓరకమైన డిప్రెషన్లో వెళ్లాను. కానీ వీణా ఇచ్చిన సపోర్ట్‌తో మానసిక ధైర్యాన్ని కూడగట్టుకొన్నాను అని రవికాంత్ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో తెలిపారు.
ఇన్‌స్టాలో భార్య గురించి రవికాంత్
రవికాంత్ పేరేపు మరో పోస్టులో.. ఐదేళ్ల నుంచి వీణాతో నా బంధం కొనసాగుతున్నది. ఆమెలో నాకు గొప్ప స్నేహితురాలు కనిపించారు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆమెతోనే జీవితాన్ని కొనసాగించాలని అనుకొన్నాను. జీవితంలో ఎలాంటి విషయాలు చేసుకొనగలిగే వ్యక్తి ఆమె. సమాజంలో ఎలా ఉండాలో.. ఎప్పుడు ఎలా వ్యవహరించాలనే విషయాన్ని ఆమె నేర్పించారు అని రవికాంత్ ఎమోషనల్‌గా స్పందించారు.
క్షణం సినిమా గురించి
ఇక రవికాంత్ పేరెపు తొలి చిత్రం క్షణం తమిళ రీమేక్‌గా త్వరలో రిలీజ్ కానున్నది. అలాగే ఈ సినిమాను హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నిర్మాత సాజిద్ నడియావాల రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సాజిద్ దర్శకత్వం కూడా వహించడం విశేషం. నవాజుద్దీన్ సిద్దిఖీ, టబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనను యూనిట్ వెల్లడించలేదు.