twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RGVకి కరోనా వచ్చిందంటూ పుకార్లు.. కండలు చూపిస్తూ కౌంటర్ ఇచ్చిన వర్మ!

    |

    విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వకుండా ఉండదు. ఇక తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా ఆర్జీవి స్పంధించే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రీసెంట్ గా వర్మకు కరోనా వచ్చిందేమో అనేంతల కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. ఇక జ్వరం తీవ్రత కూడా పెరిగిందని కథనాలు రావడంతో వర్మ అందుకు కౌంటర్ ఇచ్చిన విధానం మామూలుగా లేదు. కండలు చూపిస్తూ మరి కౌంటర్ ఇచ్చాడు.

    Recommended Video

    RGV : తన పై వస్తున్న రూమర్ల పై Ram Gopal Varma అదిరిపోయే సమాధానం!! | Oneindia Telugu
    కోవిడ్-19 తీవ్రత పెరుగుతున్నా

    కోవిడ్-19 తీవ్రత పెరుగుతున్నా

    రామ్ గోపాల్ వర్మ లాల్ డౌన్ మొదలైనప్పుటి నుంచి కూడా రెగ్యులర్ గా ఎదో ఒక పని చేస్తూ కనిపిస్తున్నాడు. ఒక విధంగా వర్మ గతంలో కంటే కూడా ఇప్పుడే ఎక్కువ బిజీగా ఉన్నాడు. కోవిడ్ 19 తీవ్రత పెరుగుతున్నా కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే వీలైనంత వరకు వర్మ చాలా జాగ్రత్తగా అతికొద్ది మంది ద్వారానే షూటింగ్స్ చేస్తున్నాడు..

    వర్మకు తీవ్ర జ్వరం

    వర్మకు తీవ్ర జ్వరం

    తనకంటూ ఒక స్పెషల్ వెబ్ సైట్ క్రియేట్ చేసుకొని అందులోనే సినిమాలను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వరుస షూటింగ్స్ కారణంగా ఇటీవల వర్మ అనుకోకుండా కొంత అస్వస్థతకు గురైనట్లు అలాగే తీవ్రమైన జ్వరం కూడా ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఇక కొందరైతే కోవిడ్ వచ్చింది అన్నట్లుగా పేర్కొనడంతో వర్మ అదిరిపోయే సమాధానం ఇచ్చారు.

    నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను

    తనపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పిన వర్మ బహుశా ఈ వార్త అబద్ధం అయినందుకు వాళ్ళు చాలా బాధపడి ఉంటారని అన్నారు. ఈ విషయంపై స్పందిస్తూ.. గత కొన్ని రోజులుగా నేను జ్వరంతో అలాగే కోవిడ్ తో బాధపడుతున్నట్లు కొందరు అనుకుంటున్నారు. కానీ నిజం ఏమిటంటే నేను చాలా ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నాను.

    కండలు చూపిస్తూ కౌంటర్

    కండలు చూపిస్తూ కౌంటర్

    నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నాను. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ కూడా తీస్తున్నాను. అలాగే రెగ్యులర్ గా వర్కౌట్స్ కూడా చేస్తున్నాను. ఇక నేను అనారోగ్యంతో ఉన్నాను అని హ్యాపీగా ఉన్నవారిని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి. భవిష్యత్తులో మీ కోరిక నెరవేరాలని విష్ చేస్తున్నాను. కానీ నేను మాత్రం వర్కౌట్స్ చేస్తూ ఆరోగ్యంగా ఉంటాను అని వర్మ తన కండలు చూపిస్తూ కౌంటర్ ఇచ్చారు.

    English summary
    Director Ram Gopal Varma has once again targeted Pawan Kalyan. It has been rumored for the past few days that he is going to make a movie titled Power Star. Finally, he released a special first look poster for the film. Varma, who has been hanging out with some of the most spicy bold films, has now become a hot topic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X