Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రెండు గంటలు కడుపుబ్బ నవ్విస్తుంది.. హైదరాబాద్ నవాబ్స్2 గురించి..
2006 సంవత్సరంలో విడుదలైన హైదరాబాద్ నవాబ్ సినిమాకు సీక్వెల్‌గా మరో చిత్రం జులై 19న విడుదల కానుంది. ఆర్.కె నిర్మించి దర్శకత్వం వహించిన హైదరాబాద్ నవాబ్ 2 సినిమా ప్రెస్ మీట్లో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.
నిర్మాత, దర్శకుడు ఆర్.కె మాట్లాడుతూ... రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఈ సినిమా కథ రాయడం జరిగింది. ఓల్డ్ సిటీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. రెండు గంటలు ఈ సినిమా ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. హీరోలు, హీరోయిన్స్ అందరూ బాగా నటించారు. చక్కని పాటలు ఉన్నాయి. జులై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను. హైదరాబాద్ లోకల్ కల్చర్ ను బేస్ చేసుకొని తీసాం. మీ అందరి సపోర్ట్ కావాలి అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ మాట్లాడుతూ... నేను రవిబాబు గారి సినిమాలకు మ్యూజిక్ చెయ్యడం జరిగింది. ఈ సినిమాలో పాటలన్ని బాగా వచ్చాయి.
ఆర్టిస్ట్ రఘు మాట్లాడుతూ... 'జులై 19న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను ప్రేక్షకులు ఆధారిస్తారని నమ్ముతున్నాము. ఈ మూవీలో మంచి పాత్ర చెయ్యడం జరిగింది. నిర్మాత దర్శకుడు ఆర్.కె మరిన్ని మంచి చిత్రాలు చెయ్యాలని కోరుకుంటున్న' అన్నారు.
హీరో అలీ రజీత్ మాట్లాడుతూ... '2006 లో హైదరాబాద్ నవాబ్ చూశాను, బాగా నచ్చింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ లో నటించడానికి అవకాశం రావడం ఆనందంగా ఉంది. ధ్రువ సినిమాలో చిన్న పాత్ర చేసాను అలాగే సీరియల్స్ లో నటించాను. హైదరాబాద్ నవాబ్2 మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను' అని తెలిపారు.
హీరో అజీజ్ మాట్లాడుతూ... స్క్రిప్ ఈ సినిమాకు హీరో. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. కామెడీ ఈ సినిమాలో మెయిన్ హైలెట్. సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. జులై 19న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని పేర్కొన్నారు.
హీరోయిన్ ఫరా ఖాన్ మాట్లాడుతూ... 'నాకు ఈ సినిమాలో నటించడానికి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఆర్.కె గారికి ధన్యవాదాలు. హైదరాబాదీ అమ్మాయిగా ఈ సినిమాలో కనిపించబోతున్నాను. టీమ్ అందరికి బెస్ట్ అని విషెస్ తెలిపారు.
హీరోయిన్ సూఫీ ఖాన్ మాట్లాడుతూ... 'ఆర్.కె మామ గారికి థాంక్స్, టీం అందరూ కలిసి మంచి సినిమాను నిర్మించాము. అన్నీ పాటలు బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ మంచి సాంగ్స్ ఇచ్చారు. సినిమా బాగుంటుంది' వెల్లడించారు.
సమైరా మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు నటించడానికి అవకాశం ఇచ్చిన మామ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో కామిడి మీ అందరికి నచ్చుతుంది. కుటుంభం అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి' అని చెప్పారు.