»   » టీవీ యాంకర్‌ను ప్రేమించా, వ్యభిచారి.... చెప్పుతో కొడతా, మంచు లక్ష్మి, నిహారిక, మంజుల కాదుగా?

టీవీ యాంకర్‌ను ప్రేమించా, వ్యభిచారి.... చెప్పుతో కొడతా, మంచు లక్ష్మి, నిహారిక, మంజుల కాదుగా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Manchu Lakshmi,Niharika,Manjula Really Did That?

యజ్ఞం, వీరభద్ర, ఆటాడిస్తా, పిల్లా నువ్వు లేని జీవితం, సౌఖ్యం లాంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎఎస్ రవికుమార్ చౌదరి. తాజాగా ఆయన రెండు వేర్వేరు ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. ఒకదాంట్లో ఓ లేడీ జర్నిలిస్టు ఆయన్ను ఇంటర్వ్యూ చేయగా ఆమెను అడిగిమరీ.....కెమెరాముందే సిగరెట్ తాగుతూ, మధ్యలో మందు కూడా కొట్టి వచ్చి పలు షాకింగ్ విషయాలు బయట పెట్టారు.

టీవీ యాంకర్‌ను ప్రేమించా, వ్యభిచారి అని తెలియదు

టీవీ యాంకర్‌ను ప్రేమించా, వ్యభిచారి అని తెలియదు

తన ఒంటిపై ఉన్న పచ్చబొట్ల గురించి ప్రస్తావించగా...... రవికుమార్ చౌదరి కాస్త ఎమోషనల్ అయ్యారు. ఒక వ్యభిచారిని ప్రేమించాను. ఆమె వ్యభిచారి అని తెలియకుండానే ప్రేమించాను. పేరు చెప్పమంటే చెప్పేస్తాను. బయపడేది లేదు. అప్పట్లో ఓ ప్రముఖ టీవీలో ఓ యాంకర్‌గా చేసేది అంటూ రవి కుమార్ చౌదరి తెలిపారు.

అప్పట్లో ఫస్ట్ లవ్ మైకంలో ఉండిపోయా

అప్పట్లో ఫస్ట్ లవ్ మైకంలో ఉండిపోయా

ఆ టైమ్‌లో ఫస్ట్ లవ్. ఇన్‌ఫాక్చువేషన్ లాంటిది...అపుడు తెలియలేదు. ఆమె కోసం నైట్ 11 గంటలకు జూబ్లీ హిల్స్ నుండి నడుచుకుంటూ సోమాజిగూడ వెళ్లేవాడిని. నన్ను దాని నుండి బయట పడేయడానికి డైరెక్టర్ వినాయక్, సాగర్ ట్రై చేశారు. కానీ నేను వినిపించుకోలేదు అని రవికుమార్ తెలిపారు.

మందు కొట్టి ఇంటికెళ్లి అల్లరి చేశాను

మందు కొట్టి ఇంటికెళ్లి అల్లరి చేశాను

ఆ దొంగ ము** ఏం చేసిదంటే... నన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పి, మరో వ్యక్తితో మ్యారేజ్ అరేంజ్ చేసుకుంది. నాకు తెలిసింది. అపుడు ఫుల్‌గా మందు కొట్టేసి ఇంటికెళ్లి అల్లరల్లరి చేశాను అని రవి కుమార్ చౌదరి తెలిపారు.

ఆమె కోసం చాలా చేశాను

ఆమె కోసం చాలా చేశాను

అపుడు నేను సీరియల్స్ చేస్తున్నాను. ఆమెను యాక్టింగ్ నుండి దారి మళ్లించి మంచి టెక్నీషియన్ చేద్దామనుకున్నాను. కథ, మాటలు అన్నీ నేనే రాసి, కోడైరెక్టర్ గా ఉంటూ డైరెక్టర్‌గా ఆమె పేరు వేశాను. కానీ నన్ను ప్రేమ విషయంలో అలా చేసింది అని రవి కుమార్ చౌదరి వెల్లడించారు.

దండలతో పాటు బ్లేడు కూడా తీసుకెళ్లా

దండలతో పాటు బ్లేడు కూడా తీసుకెళ్లా

ఆమె పెళ్లయిపోయాక తన భర్తతో కలిసి దసపల్లా హోటల్ వచ్చింది. సరే అని చెప్పి రెండు దండలు తీసుకుని, ఓ బ్లేడు కూడా తీసుకుని వెళ్లాను. నా ముందే వారి దండలు మార్పించాను. బ్లేడుతో నా వేలు కట్ చేసి రక్తంతో అతడికి తిలకం దిద్దాను. నేను ప్రేమలో ఓడిపోయాను, నువ్వు గెలిచావు అని అతడితో చెప్పాను. తర్వాత బాధతో హైదరాబాద్ వదిలి వెళ్లిపోతూ రైల్వే స్టేషన్ వద్ద ఆమె పేరు నా ఒంటిపై పచ్చబొట్టు వేయించుకున్నాను. ఆమె అంటే అప్పట్లో అంత పిచ్చి ఉండేది... అని రవికుమార్ చౌదరి తెలిపారు.

లవ్ ఫెయిల్యూర్ తర్వాత అండమాన్ వెళ్లిపోయా

లవ్ ఫెయిల్యూర్ తర్వాత అండమాన్ వెళ్లిపోయా

లవ్ ఫెయిల్యూర్ తర్వాత వైజాగ్ వెళ్లిపోయాను. హైదరాబాద్ రావాలనిపించలేదు. ఎందుకంటే అపుడు నా స్నేహితులంతా ఈ ప్రేమ వద్దని చెప్పినా వినలేదు. అందుకే వారికి నా మొహం చూపించాలనిపించలేదు. కొన్ని రోజులు వైజాగ్ లో ఉండి మనసు బాగోలేక అండమాన్ షిప్ ఎక్కేశాను. అక్కడ పరిచయం అయిన పచ్చళ్లు అమ్ముకునే వ్యక్తి నా గురించి తెలిసి నాకు ఆశ్రయం ఇచ్చి, ఉపాధి కూడా చూపించారు. కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత ఆ ఫ్యామిలీ నాకు చాలా దగ్గరైంది. అండమాన్ లో చాలా మంది స్నేహితులు కూడా తయారయ్యారు. తర్వాత సాగర్ గారు పిలవడంతో మళ్లీ వచ్చి సినిమాల్లో కో డైరెక్టర్‌గా చేరిపోయాను అని రవి కుమార్ చౌదరి వెల్లడించారు.

వర్మ గురించి కామెంట్స్, నీకు కూడా ఓ కూతురు ఉంది కదా

వర్మ గురించి కామెంట్స్, నీకు కూడా ఓ కూతురు ఉంది కదా

జీఎస్టీ తీసిన వర్మ మీద రవికుమార్ చౌదరి ఫైర్ అయ్యారు. నీకు కూడా ఓ కూతురు ఉంది కదా, ఇలాంటివి తీయడం ఏమిటని మండి పడ్డారు. ఇపుడున్న వర్మ వాడెవడో ఈడియట్, నాకు తెలిసింది ఆ రామ్ గోపాల్ వర్మ... ఈ రామ్ గోపాల్ వర్మ తెలియదు అని రవి కుమార్ చౌదరి తెలిపారు.

బెడ్ షేర్ చేసుకుంటేనే అవకాశాలా? చెప్పుతో కొడతాను

బెడ్ షేర్ చేసుకుంటేనే అవకాశాలా? చెప్పుతో కొడతాను

కాస్టింగ్ కౌచ్ అంశం ప్రస్తావన రాగా రవి కుమార్ చౌదరి సీరియస్ అయ్యారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌తో బెడ్ షేర్ చేసుకుంటేనే అవకాశాలు ఇస్తున్నారని అనడం సరికాదని, ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడే వారిని చెప్పుతో కొడతాను అంటూ రవికుమార్ చౌదరి మండి పడ్డారు.

మంచు లక్ష్మి, నిహారిక, మంజుల అలా చేశారా?

మంచు లక్ష్మి, నిహారిక, మంజుల అలా చేశారా?

‘ఇండస్ట్రీలో బెడ్ షేరింగ్ చేసుకుంటేనే మీరు ప్రూవ్ అవుతారంటే మంచు లక్ష్మి అలా చేసిందా? నిహారిక అలా చేసిందా? మంజుల అలా చేసిందా? చెప్పండి.... లేదు కదా, వారి టాలెంట్ వారు ప్రూవ్ చేసుకున్నారు' అని రవి కుమార్ చౌదరి వెల్లడించారు.

అలాంటివి ఇండస్ట్రీకి ఆపాదించవద్దు

అలాంటివి ఇండస్ట్రీకి ఆపాదించవద్దు

సినిమా ముసుగులో రాజకీయ నాయకులకు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకు సినిమా ప్రొడ్యూసర్లు కొందరు అమ్మాయిలను సప్లై చేసే బ్రోకరిజం నడుపుతున్నారనే టాక్ ఉంది... దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నకు రవికుమార్ స్పందిస్తూ....‘మీకు దమ్ముంటే ఒక పేరు చెబితే మాట్లాడతాను. ఒక వేళ ఉంటే అలాంటి వాడిని ఒకడిని బేస్ చేసుకుని ఇండస్ట్రీ మొత్తం ఇలా అని దయచేసి ఆపాదించవద్దు అన్నారు.

వినాయక్, శ్రీను వైట్ల గురించి

వినాయక్, శ్రీను వైట్ల గురించి

వినాయక్‌కు ఉన్న మంచితనం నాకు లేదు, ఆ క్రమ శిక్షణ కూడా లేదు. ఆయనంటే ఎందుకో బాగా ఇష్టం. శ్రీను వైట్ల కొంచెం కమర్షియల్‌గా ఉంటాడు. శ్రీను గురించి ఎక్కువ చెప్పను, చెబితే నెగెటివ్ చెప్పాల్సి వస్తుందేమో? అంటూ..... రవికుమార్ చౌదరి దాటవేశారు.

పవన్ కళ్యాణ్ గురించి

పవన్ కళ్యాణ్ గురించి

పవన్ కళ్యాణ్ మంచి చేద్దామని వచ్చాడు. ఆయనపై ఆరోపణలు సరికాదు. ఆయనకు అధికారం ఇస్తే ఆయన అనుకున్నది చేస్తాడేమో?.... అని రవికుమార్ చౌదరి వ్యాక్యానించారు.

అక్కడ రజనీ, ఇక్కడ బాలయ్య.... బాలయ్యను చూసి సిగ్గుపడాలి

అక్కడ రజనీ, ఇక్కడ బాలయ్య.... బాలయ్యను చూసి సిగ్గుపడాలి

ఇపుడు పార్టీలు పెట్టి మేమేదో చేద్దాం అంటున్న వారికంటే రజనీకాంత్ బెటర్.... తెలుగులో రజనీకాంత్ లాంటి వారు లేరనడం సరికాదు, మా బాలయ్య బాబు ఉన్నాడు. మన పొలిటీషియన్స్ అందరూ ఆయన్ను చూసి సిగ్గు పడాలి.... అని రవి కుమార్ చౌదరి తెలిపారు.

ప్రకాష్ రాజ్ గొడవ గురించి, గాడుదలను పెట్టుకోవచ్చుగా అన్నాడు

ప్రకాష్ రాజ్ గొడవ గురించి, గాడుదలను పెట్టుకోవచ్చుగా అన్నాడు

ఓ సినిమా విషయంలో ప్రకాష్ రాజ్ నేను అనుకున్న విధంగా డైలాగ్ చెప్పక పోవడంతో వన్ మోర్ అన్నాను. దేనీకీ? అన్నాడు. తలపై చేయి పెట్టలేదనా? అంటే అవును అన్నాను. దీంతో ఆయనకు కోపం వచ్చింది. కాలు నేలకేసి కొట్టి తర్వాత కారావ్యాన్‌ను తన్నాడు. చేయి ఎక్కడ పెట్టుకోవాలో కాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలిస్తే ఇక నేనెందుకు? నేషనల్ అవార్డీ ఇక్కడ, గాడుదులను పెట్టుకోవచ్చుగా...అంటూ ఫైర్ అయ్యారు. నేను సైలెంటుగా ఉన్నాను. రెండు నిమిషాలు టైమ్ కావాలని చెప్పి పక్కకు వెళ్లి వచ్చి మళ్లీ నేను చేయమన్నట్లు చేశాడు. ఇందులో వివాదం ఏమీ లేదు.... అని రవి కుమార్ చౌదరి తెలిపారు.

వైఎస్ జగన్ మామ బెదిరించలేదు, మంచి వ్యక్తి

వైఎస్ జగన్ మామ బెదిరించలేదు, మంచి వ్యక్తి

వైఎస్ జగన్ మామ రవీంద్రనాథ్ రెడ్డితో వివాదం ఏమీ లేదు. వీరభద్ర టైమ్ లో నాకు అడ్వాన్స్ ఇచ్చారు. నన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. టైమ్ కూడా ఇచ్చారు. బెదిరించాడనే వార్తల్లో నిజం లేదు. నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు... అని రవి కుమార్ తెలిపారు.

బాలయ్య విషయంలో ఆ బాధ ఉంది

బాలయ్య విషయంలో ఆ బాధ ఉంది

నాకు అందరు హీరోలంటే ఇష్టం, బాలయ్య అంటే ఎక్కువ ఇష్టం. యజ్ఞం తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ బాలయ్య బాబుతో చేయాలని ఫిక్స్ అయ్యాను. ఆయనతో అవకాశం వచ్చింది. వీరభద్ర చేశాను. ఆయనతో హిట్ కొట్టలేదనే బాధ ఉంది. నేను మరో పది సక్సెస్ చిత్రాలు తీసినా ఆయనతో సక్సెస్ కొట్టే వరకు ఆ బాధ అలానే ఉంటుంది అని రవికుమార్ చౌదరి చెప్పుకొచ్చారు.

English summary
Director A S Ravi Kumar Chowdary sensational comments about his love failure.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu