twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో శివాజీ ఓ మానసిక రోగి

    By Srikanya
    |

    హైదరాబాద్ : శివాజీ ఒక మానసిక రోగి. నేను కాంట్రవర్సీ పర్సన్‌ని కాదు. చాలా మంది పెద్ద హీరోల సినిమాలకు కూడా దర్శకత్వశాఖలో పనిచేశాను. వాళ్లందరూ దర్శకులను దేవుళ్లలాగా చూసుకుంటారు. కానీ శివాజీలాగా ఎవరూ ప్రవర్తించరు'' అని ‘బూచమ్మ బూచోడు' దర్శకుడు రేవన్‌ యాదు అన్నారు. శివాజీ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘బూచమ్మ బూచోడు' ఇటీవల విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో తనకు చోటు కల్పించడం లేదని రేవన్‌యాదు మీడియాతో చెప్పారు.

    ఆయన మాట్లాడుతూ... ‘‘మా ‘బూచమ్మ బూచోడు' సినిమా కేవలం తన వల్లే ఆడుతోందని శివాజీ ప్రచారం చేసుకుంటున్నారు. నేను దర్శకత్వం వహించినా, నన్ను పట్టించుకోవట్లేదు. పక్కనపెట్టేస్తున్నారు. నిజంగా శివాజీకి అంత ప్రతిభ ఉంటే ఆయన గత సినిమాలన్నీ ఎందుకు ఫ్లాపయ్యాయి? గత సినిమాలకు ఎందుకు ఓపెనింగ్స్‌ రాలేదు?'' అని రేవన్‌ యాదు ప్రశ్నించారు.

    ఇంకా ఆయన మాట్లాడుతూ- సినిమా విజయం గూర్చి మాట్లాడితే ప్రేక్షకులకు సినిమా నచ్చింది. అయితే వెబ్‌మీడియాలో వచ్చిన రివ్యూలు మరోలా ఉన్నాయి. ఏదేమైనా సినిమా విడుదలైన తరువాత మంచి టాక్ తెచ్చుకొని నడుస్తోంది. అయితే, ఈ విజయంలో మాత్రం హీరో నన్ను భాగస్వామిని చేయడంలేదు. 18 నెలలు ఈ సినిమాకోసం కష్టపడ్డాను. ఈ చిత్ర హీరో ఎక్కడ కూడా సినిమా క్రెడిట్‌లో కొంతైనా దర్శకుడికి చెందుతుందనే మాట ఎక్కడా చెప్పడంలేదు. ఆ విజయానికి కారణం నేనే అనే రీతిలో ప్రచారం చేసుకుంటున్నాడు. సినిమా అంతా తనదే, తన కష్టమే అని ఆయన మాట్లాడుతున్నారు. నేను 15 సంవత్సరాల క్రితం సినిమా పరిశ్రమలోకి రావడం జరిగింది.

    Director's sensational comments on Hero Shivaji

    పోసాని కృష్ణమురళి దగ్గర రచయితగా పనిచేశాను. ఆ తరువాత గుణశేఖర్‌గారి దర్శకత్వంలో వచ్చిన ‘బాల రామాయణం' సినిమానుండి ఈమధ్య వచ్చిన ‘నిప్పు' సినిమావరకూ ఆయన దగ్గర పనిచేశాను. ఈ సినిమా కోసం కథ విన్న శివాజీ, మనం చేద్దామని నిర్మాతలనుకూడా ఆయనే తీసుకువచ్చారు. నిజానికి మూడు నెలల్లో అయిపోవాల్సిన సినిమా ఇన్ని రోజులు పట్టింది. గత ఐదారేళ్లుగా ఎలాంటి విజయంలేని శివాజీకి ఈ విజయాన్ని ఇచ్చింది నేనే కదా! నా మిత్రులు ప్రకాష్‌తో కలిసి ఈ కథను రెడీ చేసుకున్నాను. ఎంతో కష్టపడి చాలా తక్కువ బడ్జెట్‌లో ఈ సినిమాని ఇంత క్వాలిటీగా రూపొందించాను. కానీ, ఈరోజు ఆ క్రెడిట్ అంతా హీరో శివాజీ తీసుకొని చానళ్లలో కూర్చుని అంతా తానే చేశానని చెప్పుకొంటున్నాడు.

    చాలామంది నన్ను చూసి తిడుతున్నారు. శివాజీ సినిమా చేస్తే నువ్వు పేరేసుకున్నావా అని. అది విని నాకు చాలా బాధేసింది. ఈ విషయంపై నిర్మాతలు కూడా శివాజీని అడుగుతామన్నారు. సినిమాను నేనేదో గొప్పగా తీశాను, ఆ ఫలితం మొత్తం నాకే రావాలని ఉద్దేశ్యం నాకు లేదు. ఈ సినిమాలో నేను కూడా ఒక భాగమే అని చెప్పుకోవాలని ఉద్దేశ్యం నాది. ఈ సినిమా రూపొందిస్తున్న టైమ్‌లో బడ్జెట్ పరంగా ఎన్నో అడ్డంకులు వచ్చాయి. అయినా వాటన్నింటిని దాటుకొని ఓ మంచి సినిమా చేయాలనే తపనతో సినిమాకు మంచి ఔట్‌పుట్ ఇచ్చాను. అలాగే, నాకు తెలిసిన నటీనటులను, టెక్నీషియన్లను కూడా ఒప్పించి ఈ సినిమాకు పనిచేయించాను. ఇంత కష్టపడ్డ నాకు ఏమాత్రం సంబంధం లేనట్టుగా హీరో శివాజీ ప్రవర్తించడం బాధగా ఉందంటూ తన ఆవేదన వెలిబుచ్చారు దర్శకుడు.

    English summary
    Revan Yadu, the director of recently released horror comedy Boochamma Boochodu, breathed fire at Hero Shivaji for not giving him due credit. He alleged Shivaji has been harassing him by not allowing him to take part in movie promotions and by claiming the film is a hit solely because of him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X