Pawan Kalyan: బీమ్లా నాయక్ తో యువ దర్శకుడి చర్చలు.. మరో హై వోల్టేజ్ స్టిల్!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి యువ దర్శకులు నుంచి సీనియర్ దర్శకులు వరకు చాలామంది లైన్ లో ఉన్నారు. చాలావరకు అగ్రహీరోలు ఫామ్ లో ఉన్న దర్శకులతోనే ఎక్కువగా సినిమాలు చేయడానికి ఇష్టపడతారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వారందరి కంటే భిన్నంగా ఆలోచిస్తూ టాలెంటెడ్ దర్శకులకు ఎక్కువగా అవకాశాలు ఇస్తుంటారు. పవన్ కళ్యాణ్ తన కెరీర్ చాలా వరకు చిన్న స్థాయిలో ఉన్న దర్శకులతో ఎక్కువగా వర్క్ చేశాడు. పవన్ కళ్యాణ్ తో చేసిన తర్వాతనే కొంత మంది దర్శకులు మరో స్థాయికి వెళ్లారు కూడా..
పవన్ కళ్యాణ్ తో వర్క్ చేస్తే ఎవరైనా సరే అతనికి అభిమానిగానే కాకుండా మరింత ఆత్మ బంధువుగా మారిపోతారు. పవర్ స్టార్ తో వర్క్ చేసిన ప్రతి దర్శకుడు కూడా ఆయన గురించి గొప్పగానే చెబుతుంటారు. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ సాగర్ చంద్ర పైనే ఉంది. దర్శకుడు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి తెలుసు. అలాంటిది మూడవ అవక్షంలోనే పవర్ స్టార్ సినిమాను దక్కించుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. అలాగే అతను గతంలో చేసిన సినిమాల గురించి ఫ్యాన్స్ ఆరా తీశారు. సాగర్ కే చంద్ర ఇంతకుముందు కేవలం రెండు సినిమాకు మాత్రమే దర్శకత్వం వహించాడు.

అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు.. వంటి విభిన్నమైన సినిమాలను తెరకెక్కించి ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అతని మేకింగ్ కు ఎప్పుడు ఫ్యాన్ అయిపోయాడు. ఇక అతని పై నమ్మకంతో పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం ఇప్పించారు. ప్రస్తుతం అయ్యప్పనుమ్. కొశీయుమ్ రీమేక్ కు సాగర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు కూడా అందిస్తున్నాడు. అయితే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ పై ఆదివారం క్లారిటీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పవన్ కళ్యాణ్ కి సీన్లు వివరిస్తున్న ఒక ప్రత్యేకమైన పోస్టర్ను విడుదల చేశారుమ్ అందులో సాగర్ చంద్ర, పవన్ కళ్యాణ్ కు చాలా సీరియస్ గా సన్నివేశం గురించి చెబుతున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే మరో గబ్బర్ సింగ్ తరహాలో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ ఎలా ఉన్నాడు అని అనిపిస్తోంది.
దర్శకుడిపై పవన్ కళ్యాణ్ కూడా బలమైన నమ్మకంతో ఉన్నాడని టాక్ వస్తోంది. ఇక సినిమాలో మరొక కీలకమైన పాత్ర కోసం రానా దగ్గుబాటిని సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఇది ఒక పర్ఫెక్ట్ రీమేక్ మూవీ అవుతుందని కూడా అంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ 50వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నాడు. మరి ఆ రోజు ఎలాంటి అప్డేట్ ఇస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











