ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
సినిమా ఇండస్ట్రీలో యాక్టర్లకు కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా ఏదో ఒక సమయంలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొక తప్పదు. అయితే తాజాగా సీనియర్ హీరోయిన్ ఇంద్రజకు ఓ స్టార్ డైరెక్టర్ అప్పట్లో సెట్స్ లో చుక్కలు చూపించారట. మరి ఆయన ఈ హీరోయిన్ తో ఎందుకు అలా బిహేవ్ చేశాడు అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
సీనియర్ హీరోయిన్ ఇంద్రజ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బుల్లితెర షోలలో మెరుస్తున్న ఈ బ్యూటీ ఒకప్పుడు సీనియర్ హీరోలైన కృష్ణ, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి వారితో రొమాన్స్ చేసింది. ఇప్పుడు మాత్రం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కనిపిస్తోంది.

అయితే ఇంద్రజ విషయంలో ఓ టాలీవుడ్ డైరెక్టర్ చాలా కఠినంగా వ్యవహరించారట. అది కూడా 90వ దశకంలో కావడం విశేషం. ఒకప్పటి డైరెక్టర్ సాగర్ అప్పట్లో జరిగిన ఓ సంఘటన కారణంగా ఇంద్రజతో ఒక్కరు కూడా మాట్లాడొద్దు అంటూ ఆమెకు మూడు రోజుల పాటు సెట్స్ లో చుక్కలు చూపించారట. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే బయట పెట్టారు.
ఇంద్రజ ట్యాలెంట్ చూసి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన అమ్మ దొంగ మూవీలోకి హీరోయిన్ గా తీసుకున్నామని గుర్తు చేసుకున్న ఆయన ఈ సీనియర్ హీరోయిన్ కు ఆ హిట్ తోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చిందని వెల్లడించారు. ఆ తర్వాత మరో మూవీలో కూడా ఆమెకి అవకాశం ఇవ్వాలనుకున్నారట. అందుకే మళ్లీ తను కృష్ణతో జగదేకవీరుడు అనే సినిమా చేస్తున్న సమయంలో ఇంద్రజని తీసుకున్నామని వెల్లడించారు.
అయితే అప్పట్లో ఆ సినిమాలో సీనియర్ నటి కేఆర్ విజయ కూడా నటించారని, ఈ హీరోయిన్ లు ఇద్దరినీ సెట్స్ కు తీసుకొచ్చే విషయంలో ఇంద్రజ పొగరుగా వ్యవహరించిన తీరు గురించి బయట పెట్టారు ఈ సీనియర్ డైరెక్టర్. సీనియర్ నటి విజయను రప్పించడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని మేనేజర్ కి చెప్పగా, ఆమె మాత్రం నాకు ఫ్లైట్ ఎందుకు ట్రైన్ బుక్ చేయండి వచ్చేస్తాను అని సింపుల్ గా చెప్పేసారట.
ఆమె మంచితనానికి ఆశ్చర్యపోయిన ఈ సీనియర్ డైరెక్టర్ సాగర్ ఆమెతో పాటే ఇంద్రజకి కూడా ట్రైన్ టికెట్ బుక్ చేయమని చెప్పారట. కానీ ఆ సమయంలో మేనేజర్ దగ్గర ఇంద్రజ పొగరుగా మాట్లాడి మొండికేయడంతో మళ్లీ ఫ్లైట్ టికెట్ బుక్ చేయాల్సి వచ్చింది అని గుర్తు చేసుకున్నారు డైరెక్టర్ సాగర్.
అయితే ఆమె ప్రవర్తించిన తీరుతో చిరాకు వచ్చిన డైరెక్టర్ సాగర్ సెట్స్ లో అందరికీ ఇంద్రజతో ఒక్కరు కూడా మాట్లాడకూడదు అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారట. దీంతో మూడు రోజులపాటు ఆమెతో ఒక్కరు కూడా మాట్లాడలేదట. ఆ తర్వాత ఇంద్రజ ఏడుస్తూ డైరెక్టర్ సాగర్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పిందట. దాంతో ఆయన నీకు గుర్తింపు వచ్చిందే అమ్మ దొంగ మూవీ వల్ల, ఆ విషయాన్ని ఎలా మర్చిపోయావు? నీ మీద ఉన్న మంచి అభిప్రాయం కాస్తా పోయింది అని ఇంద్రజను మందలించినట్టు సాగర్ తాజా ఇంటర్వ్యూలో బయట పెట్టారు.


Click it and Unblock the Notifications











