Baby కథ చెబితే హీరో రెజెక్ట్ చేశారు.. వాడి సినిమా అస్సలు చేయనన్నారు: డైరెక్టర్ ఎమోషనల్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన లేటెస్ట్ మూవీ బేబి. హృదయకాలేయం, కొబ్బరి మట్ట డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. జూలై 14న విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తోపాటు కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బేబి మూవీ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు సాయి రాజేష్ బేబి కథను ఓ హీరో రెజెక్ట్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ఇంతకీ సాయి రాజేష్ ఏం మాట్లాడారంటే?
సంపూని చూసి:"లోపల మిక్స్ డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. సంతోషంగా ఉంది. కొంచెం అలా అలా కూడా ఉంది. డే 1 కంటే డే 4 కలెక్షన్స్ బాగున్నాయి. చాల సంతోషంగా ఉంది. కొబ్బరి మట్ట విడుదలైన తర్వాత రెండు మూడు రోజులు ట్రోల్స్, అబ్యూసివ్ మాటలు ఇదేం లేకి కామెడీరా అంటూ నెగెటివిటీ వచ్చింది. తర్వాత సంపూతో రాజమండ్రి వెళ్లాను. థియేటర్లలో సంపూని చూసి ఒక ఆటో డ్రైవర్ బాగా చేశావ్ అన్నాడు, సంతోషపడుతున్నాడు" అని సాయి రాజేష్ తెలిపారు.

మారేది లేదు:"కొబ్బరి మట్ట విడుదలైన 3 రోజులకు ఆ ఆటో డ్రైవర్ చూడటం ఇది ఆరోసారి సార్ అని మేనేజర్ చెప్పాడు. నాకు అతని మొహంలో సంతోషం చూడగానే నేను ఎలాంటి డైరెక్టర్ కావాలని క్లారిటీ వచ్చింది. ఎంతో కష్టపడి సంపాదించి, టికెట్ కొనుక్కునేవాడికి ఒక ఎమోషన్ ఉంటుంది. అది కామెడీ, ఎమోషన్ ఏదైనా ఒక హై ఉండాలి. ఇక నేను అలాంటి కథలే రాయలనుకున్నాను. అలాంటి సినిమాలే తీస్తాను. బేబి గురించి గర్వంగా ఉంది. బేబి ఇలానే ఉంటుంది. తీయబోయే సినిమాలు కూడా ఇలాగే ఉంటాయి. అందులో మారేది లేదు" అని సాయి రాజేష్ అన్నారు.

ఆ బ్యాగేజి ఉందిగా:"బేబి కథ రాసుకున్నాక.. ఆనందే ఎందుకు కావాలనిపించిందో నాకు తెలియదు. ఆ ఆటో డ్రైవర్ క్యారెక్టర్ కు అతనే కావాలనిపించింది. విజయ్ దగ్గరకు వెళ్లాను. కథ రాసుకున్నాను. ఆనంద్ కు చెప్పాలి అని అన్నాను. చెప్పు ఏముంది దాంట్లో అని విజయ్ అంటే.. నాకు హృదయ కాలేయం, కొబ్బరిమట్ట బ్యాగేజ్ ఉంది కదా. చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంటే.. నీ సినిమాలను ఎందుకు డిస్ రెస్పెక్ట్ చేసుకుంటావ్. అవి సినిమాలు కాదా.. జనాలు చూల్లేదా. చేయి అన్నారు. ఆ నమ్మకం. మీరు ఇచ్చిన ప్రోత్సాహమే నాకు బ్రిలియంట్ యాక్టర్ ని దొరికించింది. థ్యాంక్యూ విజయ్ అన్నా" అని సాయి రాజేష్ పేర్కొన్నారు.
ఆడి సినిమా చేయను:"నేను ఈ సినిమా ఒక రేంజ్ లో ఆలోచించేవాన్ని. ఇలా తీద్దాం, హిట్ తీద్దాం అనుకున్నాను. నాకు ఇంకో హీరో (విరాజ్ పాత్రకు) కావాల్సివచ్చినప్పుడు, నేను ఇంకో హీరో అపాయింట్ మెంట్ అడిగినప్పుడు, ఎస్కెఎన్ ప్రొడ్యూసర్ కథ విన్నారు, వాసు గారు, మారుతి గారు కూడా కథ విన్నారంటే అని చెబితే.. వాడి సినిమా అయితే చేయను కూడా చేయను అని చెప్పారు. కథ కూడా వినను అన్నారు. ఆరోజు డిసైడ్ అయినా నేను.. నా హీరోను ది బెస్ట్ చూపిస్తా అని డిసైడ్ అయినా" అని సాయి రాజేష్ చెప్పుకొచ్చారు.

హాజరైనవారు:ఇలా బేబి సక్సెస్ మీట్ లో డైరెక్టర్ సాయి రాజేష్ ఎమోషనల్ గా మాట్లాడారు. కాగా ఈ కార్యక్రమానికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అలాగే డైరెక్టర్ మారుతి, ఎస్కేఎన్, హీరోలు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, హీరోయిన్ వైష్ణవి చైతన్య, సీత తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











