న్యూడ్ ఫోటోలు పంపమంటూ మెయిల్స్!?
బాలీవుడ్ లో ఇప్పుడు చర్చనీయాంశమైన విషయం..సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సాజిద్ ఖాన్ గురించే. సాజిద్ ఖాన్ నుంచి చాలా మందికి న్యూడ్ ఫోటోలు పంపమంటూ మెయిల్స్ వచ్చాయి. దాంతో చాలా మంది సాజిద్ ఖాన్ కి ఏమైంది అని ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే కొద్ది గంటల తర్వాత సాజిద్ ఖాన్ కి అసలు విషయం తెలిసి వెంటనే మెయిల్ ఓపెన్ చేస్తే అసలు విషయం తెలిసింది. ఆయన మెయిల్ ఐడి ని ఎవరో హ్యాక్ చేసారు. ఆ హ్యాకర్ వెంటనే న్యూడ్ ఫోటోలు పంపమని అందరికీ మెసేజులు పంపుతూ సాజిద్ మెయిల్ నుంచి పంపటం జరిగింది.
ఈ విషయమై సాజిద్ ఖాన్ మాట్లాడుతూ.."నేను చాలా షాక్ కి గురి అయ్యాను..కొద్ది క్షణాలు పాటు మైండ్ పనిచేయలేదు. ఏం చెయ్యాలో అర్దం కాలేదు. తర్వాత నా మెయిల్ హ్యాకింగ్ కు గురి అయ్యిందని తెలుసుకున్నాను. నా గురించి తెలిసిన చాలా మంది నా మెయిల్ చూసి నవ్వుకున్నారు. వారు ఎవరూ నా మెయిల్ నుంచి ఇలాంటి మెసేజులు రావటం నమ్మలేదు. ఏదో టెక్నికల్ గా సమస్య వచ్చిందనే నమ్మారు. నేను ఎప్పుడూ ఇలాంటి సిట్యువేషన్ ఎదుర్కోలేదు" అని వివరణ ఇచ్చారు.
సాజిధ్ ఖాన్ దర్శకుడుగా డర్నా జరూరీ హై చిత్రం తో కెరీర్ ప్రారంభించారు. 2006 లో వచ్చిన ఈ చిత్రం ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత 2007 లో అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోతో హే బేబి చిత్రం డైరక్ట్ చేసారు. ఆ హిట్టుతో హౌస్ ఫుల్ చిత్రం , హౌస్ పుల్ 2 చిత్రాలుడైరక్ట్ చేసి స్టార్ డైరక్టర్ గా ఎదిగారు. ఇప్పుడు హిమ్మత్ వాలా చిత్రం ప్లాన్ చేస్తున్నారు. హిమ్మత్ వాలా చిత్రం తెలుగులో వచ్చిన ఊరికి మొనగాడు చిత్రం రీమేక్ గా రూపొందుతోంది. తమన్నా,అజయ్ దేవగన్ ఈ చిత్రంలో పెయిర్ గా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











