ఆ దర్శకుడిపై సంవత్సరకాల నిషేదం!?!
సినిమా సెట్ లో హీరోయిన్ పద్మప్రియ చెంప చెల్లుమనిపించిన సమీపై సంవత్సరకాల బ్యాన్ ను విధించారు. తమిళ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, తమిళ్ డైరెక్టర్స్ అసోసియేషన్, నదిగర్ సంగమ్ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో ఈ సంఘాలన్నీ సంయుక్తంగా ప్రత్యేకంగా విచారణ జరిపి నిజానిజాల నిగ్గుతేల్చాయి. సమీదే తప్పని నిర్ధారణకు వచ్చాయి. దర్శకుడు సమీపై ఒక సవంత్సర నిషేదాన్ని విధించాయి. ఈ నిషేదం ప్రకారం సమీ ఏ భాషలోనూ సినిమాలకు దర్శకత్వం వహించడంకానీ మరేదికానీ చేయకూడదు. అయితే పద్మప్రియ హీరోయిన్ గా రూపొందుతున్నమిరుగమ్ సినిమాను పూర్తిచేసే అవకాశాన్ని సమీకి ఇచ్చారు.


Click it and Unblock the Notifications











