పవన్ కల్యాణ్ నేషనల్ లీడర్.. అలా చేస్తే కొత్త లోకంలో ఉంటాం.. డైరెక్టర్ కామెంట్స్

పవన్ కల్యాణ్ ఓవైపు సినిమాలతోపాటు మరోవైపు రాజకీయాల్లోనూ జోరు చూపిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా కోసం ఎంతగానో ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటిది పవన్ కల్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలో ఆయన నుంచి వస్తున్న సినిమా బ్రో (Bro Movie). ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పై నటుడు, దర్శకుడు సముద్ర ఖని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మామ అల్లుళ్లు బ్రో : మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా కలిసి నటిస్తున్నచిత్రం బ్రో. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇటీవల మంచి హిట్స్ అందుకున్న ప్రొడక్షన్ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. దీని బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వినోదయ సీతమ్ అనే తమిళ రీమెక్ గా వస్తున్న ఈ సినిమాకు సముద్ర ఖని దర్శకత్వం వహించారు.

bromovie

సెన్సార్ సర్టిఫికేట్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా నటించిన బ్రో సినిమాకు స్క్రీన్ ప్లే, సంభాషణలను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. బ్రో చిత్రాన్ని జూలై 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. మూవీ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు.

pawansamuthrikani

రెగ్యులర్ కాదు : తాజాగా డైరెక్టర్ సముద్రఖనిని యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో బ్రో సినిమా వినోదయ సీతమ్ రీమేక్ కాదని సముద్ర ఖని వెల్లడించారు. తాను తమిళంలో చేసిన కథను త్రివిక్రమ్ తెలుగులో పూర్తిగా మార్చేశారని, ఇది పూర్తిగా కొత్తగా ఉంటుందని, రెగ్యులర్ గా మనం చూసే లాంటి సినిమా కాదని ఆయన చెప్పుకొచ్చారు.

samuthrikani

సింగిల్ షాట్ : ఈ సినిమా గురించి త్రివిక్రమ్ కు చెప్పినప్పుడు తెలుగులో కల్యాణ్ తో చేస్తావా అని ఆయన అడిగారని, దానికి వెంటనే తాను ఒప్పుకున్నట్లు సముద్రఖని తెలిపారు. "10 నిమిషాల్లో సినిమా స్క్రీన్ ప్లే పూర్తిగా మార్చేశారు. సోల్ మాత్రమే ఉంచి కొత్త స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ నా ముందు ఉంచారు. పవన్ కల్యాణ్ తో ఎప్పుడూ ఫుల్ సీన్ సింగిల్ షాట్ చేయాలని చెబుతారు" అని సముద్రఖని వెల్లడించారు.
samudhrikani

ఫుల్ సీన్ : "4 పేజీల డైలాగ్స్ తో సీన్ ఉంటే దాన్ని మొత్తం ఒకేసారి చేద్దాం అంటారు. ఫుల్ సీన్ ఒకేసారి చేద్దామనే ఆర్టిస్టును చూడటం నాకు ఇదే ఫస్ట్ టైమ్. రెండు లైన్లు చెప్తే చాలా అనే ఆర్టిస్టులను నేను చూశాను. కానీ, పవన్ సార్ అలా కాదు. ఆయన ఎనర్జీ వేరు. స్టేజ్, డ్రామా అనుభవం ఉంది కాబట్టి ఫుల్ సీన్ చేద్దామనేవారు. తర్వాత మీకు ఏం కావాలో అది కట్ చేసుకోండి అంటారు" అని సముద్రఖని పేర్కొన్నారు.

మరో లోకంలో : "పవన్ సార్ ఎప్పుడూ కనిపించినా ఆశీర్వాదం తీసుకుంటాను. ఐ లవ్ యు చెబుతాను. ఆయన విజనే వేరు. ఆయనతో నేను 21 రోజులు పని చేశాను. ఆయన చెప్పిన విజన్, ఈ సొసైటీ గురించి ఆయన మైండ్ లో ఉన్న విషయం మరో స్థాయిలో ఉంది. సార్ స్టేట్ లీడర్ కాదు. నేషనల్ లీడర్. సార్ విజన్ అప్లయ్ చేస్తే మనం పూర్తిగా ఒక కొత్త లోకంలో ఉంటాం. అది త్వరలోనే జరుగుతుంది. ఆ ఎనర్జీని దేవుడు సార్ కి ఇస్తాడు" అని సముద్రఖని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X