అశ్లీలత క్యాచ్ చేస్తారనుకోలేదు: ‘అర్జున్ రెడ్డి’... 3 గంటలు కాదు, అంతకు మించి!

అర్జున్ రెడ్డి సినిమా గురించి దర్శకుడు మాట్లాడారు. సినిమా అందరికీ నచ్చుతుందన్నారు.

By Bojja Kumar

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అర్జున్ రెడ్డి' చిత్రం ఆగస్టు 25న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

ముందు తన గురించి తాను పరిచయం చేసుకుంటూ.... తాను వృత్తి పరంగా ఫిజియోతెరపిస్ట్ అని, సినిమాలపై ఆసక్తితో ఈ రంగం వైపు వచ్చినట్లు సందీప్ రెడ్డి తెలిపారు. ఆస్ట్రేలియాలో ఫిల్మ్ మేకింగ్ లో మూడేళ్లు పోస్టుగ్రాజ్యుయేషన్ చేశానని, తర్వాత నాగార్జున కేడీ చిత్రానికి అసిస్టెంటుగా పని చేశానని, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రానికి స్క్రిప్టు సైడ్ వర్క్ చేసినట్లు తెలిపారు.

పెళ్లి చూపుల కంటే ముందే

పెళ్లి చూపుల కంటే ముందే

తాను కథ చెప్పినపుడు ‘పెళ్లి చూపులు' సినిమా ఇంకా మొదలు కాలేదని, నా ఆఫీస్ ఓపెన్ చేయడం... పెళ్లి చూపులు షూటింగ్ మొదలు కావడం ఒకేసారి జరిగిందని తెలిపారు. పెళ్లి చూపులు షూటింగ్ తర్వాత విజయ్ దేవరకొండ ద్వారక సినిమా చేయడంతో ‘అర్జున్ రెడ్డి' సినిమా లేటయిందని తెలిపారు.

Recommended Video

Nani Praises Arjun Reddy @Theatrical Trailer Launch
ఫిల్మ్ స్టూడియోల్లో తీసిన సినిమా కాదు

ఫిల్మ్ స్టూడియోల్లో తీసిన సినిమా కాదు

‘అర్జున్ రెడ్డి' సినిమాలో ఒక్క సీన్ కూడా ఫిల్మ్ స్టూడియోల్లో తీయలేదని, అన్నీ రియలిస్టిక్ లొకేషన్లలో తీసామని సందీప్ రెడ్డి తెలిపారు.

అశ్లీలత క్యాచ్ చేస్తారనుకోలేదు

అశ్లీలత క్యాచ్ చేస్తారనుకోలేదు

సినిమాలోని ముద్దు పోస్టర్ వివాదంపై స్పందిస్తూ..... ఆ పోస్టర్లో డీప్ ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్ ఉంటుంది. దాన్ని క్యాచ్ చేస్తారని అనుకున్నాను కానీ అశ్లీలతను క్యాచ్ చేశారని అనుకోలేదని దర్శకుడు తెలిపారు.

అశ్లీలతను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యం లేదు

అశ్లీలతను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యం లేదు

అశ్లీలతను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో తీసిన సినిమా కాదని..... సినిమాపై అనవసర రాద్దాంతం జరుగుతోందని దర్శకుడు సందీప్ రెడ్డి తెలిపారు.

అందుకే ఆ టైటిల్

అందుకే ఆ టైటిల్

అర్జున్ రెడ్డి టైటిల్ పెట్టడానికి కారణం సినిమా ఆ క్యారెక్టర్ బేస్డ్ మీద నడస్తుందని, అందుకే ఆ టైటిల్ పెట్టినట్లు తెలిపారు.

ముందు శర్వానంద్ కు చెప్పాను

ముందు శర్వానంద్ కు చెప్పాను

ఈ సినిమా స్టోరీ ముందు శర్వానంద్ కు చెప్పాను. అది వర్కౌట్ కాలేదు. తర్వాత విజయ్ దేవరకొండతో ఫైనల్ అయినట్లు సందీప్ రెడ్డి తెలిపారు. నేను అనుకున్న పాత్రను విజయ్ సూపర్బ్ గా చూశాడని తెలిపారు.

మొత్తం సినిమా 3 గంటల 40 నిమిషాలు

మొత్తం సినిమా 3 గంటల 40 నిమిషాలు

సినిమా మొత్తం 3 గంటల 40 నిమిషాలు తీశాం. అయితే డిస్ట్రిబ్యూటర్లు అంత పెద్ద సినిమా కష్టం అవుతుందని చెప్పడంతో నెల రోజులు కష్టపడి 40 నిమిషాలు కట్ చేశామని, మొత్తం సినిమా అలా పెట్టినా చూస్తారనే గట్ ఫీలింగ్ అయితే ఉంది అన్నారు.

డివీడిలో మొత్తం సినిమా రిలీజ్ చేస్తాం

డివీడిలో మొత్తం సినిమా రిలీజ్ చేస్తాం

సినిమా రిలీజైన కొన్ని రోజుల తర్వాత డివీడీ తీసుకొస్తాం. అందులో ఎలాంటి కట్స్, మ్యూట్ సీన్లు లేకుండా మొత్తం 3 గంటల 40 నిమిషాలతో రిలీజ్ చేస్తామని సందీప్ రెడ్డి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X