twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగ్‌లో హీరోయిన్‌కు చేదు అనుభవం.. తాగుబోతు పనిపట్టిన అల్లు శిరీష్!

    |

    మెగా హీరో అల్లు శిరీష్ నటిస్తున్న తాజా చిత్రం ఎబిసిడి. అమెరికన్ బార్న్ కంఫ్యూజ్డ్ దేశీ అనేది క్యాప్షన్. మాలయంలో ఘనవిజయం సాధించిన చిత్రానికి ఇది రీమేక్. అల్లు శిరీష్ సరసన రుక్సార్ దిల్లోన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ని బుధవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. మెల్ల మెల్లగా అంటూ సాగే ఈ మెలోడీ గీతం ఆకట్టుకునే విధంగా ఉంది. జుడా శాండీ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. సాంగ్ లాంచ్ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు సంజీవ్ రెడ్డి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

     బెంగుళూరులో వెళుతుండగా

    బెంగుళూరులో వెళుతుండగా

    తాను బెంగుళూరులో వెళుతుండగా ఓ కన్నడ సాంగ్ ని విన్నానని అల్లు శిరీష్ తెలిపాడు. ఆ సాంగ్ చాలా నచ్చేసింది. ఇలాంటి కొత్తదనం ఉన్న సంగీత దర్శకుల కోసమే వెతుకుతున్నా. ఈ పాటని ఎవరు కంపోజ్ చేశారు అని ఆరా తీస్తే జుడా శాండీ అనే యువ సంగీత దర్శకుడు అని తెలిసిందే. వెంటనే అతడితో మాట్లాడి తమ ఎబిసిడి చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నాం అని అల్లు శిరీష్ తెలిపారు.

     రుక్సార్‌కు చేదు అనుభవం

    రుక్సార్‌కు చేదు అనుభవం

    దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. మెల్ల మెల్లగా సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. ఈ సాంగ్ ని మేము రోడ్ లో షూట్ చేస్తున్నాం. ఆ సమయంలో కొంతమంది తాగుబోతులు అటుగా వెళుతున్నారు. అందులో ఒక వ్యక్తి రుక్సార్ ని కామెంట్ చేస్తూ వెళ్ళిపోయాడు. మేమెంతా షూటింగ్ బిజీలో ఉంది పట్టించుకోలేదు. కానీ అల్లు శిరీష్ మాత్రం షాట్ అయిపోగానే కారులొ వెళ్లి రుక్సార్ ని కామెంట్ చేసిన వ్యక్తిని తీసుకుని వచ్చాడు. ఆమెకు క్షమాపణ చెప్పించాడు అని సంజీవి రెడ్డి షూటింగ్ లో జరిగిన సంఘటనని వివరించారు.

     వాళ్లంతా మన ఫ్యామిలీనే

    వాళ్లంతా మన ఫ్యామిలీనే

    ఈ మీడియా సమావేశంలో మాస్టర్ భరత్ అందరి హృదయాలు గెలుచుకున్నాడు. మాస్టర్ భరత్ ఎబిసిడి చిత్రంలో అల్లు శిరీష్ కు స్నేహితుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తన ప్రసంగంలో పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన వీర జవానుల గురించి ప్రస్తావించాడు. మనం ఇప్పుడు ఇక్కడ ఇంత సంతోషంగా, కూల్ గా ఉన్నామంటే దానికి కారణం పుల్వామా ఘటనలో మరణించిన వీర సైనికుల వల్లే అని భరత్ తెలిపాడు. వాళ్లంతా మన కుటుంబమే అని అన్నాడు. వాళ్ళని గుర్తు చేసుకోవడం మన భాద్యత అని భరత్ తెలిపాడు.

    చాలా జరిగాయక్కడ

    చాలా జరిగాయక్కడ

    చైల్డ్ ఆర్టిస్ట్ గా అల్లరి పాత్రలో భరత్ అందరిని అలరించిన సంగతి తెలిసిందే. భరత్ లో ఆ అల్లరి ఇప్పటికీ ఉన్నట్లుంది. షూటింగ్ లో చాలా విషయాలు జరిగాయి. వాటన్నింటి గురించి ఇప్పుడే మాట్లాడను అని అన్నాడు. మార్చి 21న ఎబిసిడి చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మధుర శ్రీధర్, యాష్ రంగినేని ఈ చిత్రానికి నిర్మాతలు.

    English summary
    Director Sanjeev Reddy Reveals Greatness of Allu Sirish at ABCD Movie Song Launch
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X