శింబుతో డైరెక్టర్ శంకర్ చిత్రం
ఎన్‌కౌంటర్, శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎన్‌కౌంటర్ శంకర్ తాజాగా ఒక తమిళ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఇటీవల నితిన్‌తో ఆయన రూపొందించిన రామ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పల్టీ కొట్టడంతో దర్శకుడు శంకర్ కొంతకాలం గ్యాప్ తీసుకున్నారు. అయితే, సహజంగానే ప్రతిభావంతుడైన శంకర్ వరుస చిత్రాలను ప్లాన్ చేయకుండా సబ్జెక్ట్ పూర్తిగా వస్తే తప్ప సినిమా రూపొందించడానికి ముందుకు రారు. తెలుగులో చిత్రం తీయడానికి ఇంకొంత కాలం సమయం పడుతుంది కాబట్టి ఈలోగా తమిళ రంగంలోకి ప్రవేశించే అవకాశాన్ని వదులుకోరాదని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
ఒక తమిళ ప్రొడ్యూసర్ నిర్మించే ఈ చిత్రంలో శింబు హీరో కాగా హీరోయిన్ ఎంపిక ఇంకా జరుగుతోంది.


Click it and Unblock the Notifications