Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కళ్యాణ్ సినిమా తప్పకుండా ఉంటుంది.. కందిరీగ 2 కూడా.. క్లారిటీ ఇచ్చిన యంగ్ డైరెక్టర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్క చాన్స్ ఇవ్వాలే గాని ఏ దర్శకుడైనా కూడా ఆయనతో సినిమా చేయడానికి రెడీగా ఉంటారు. సాధారణంగా పవన్ అగ్ర దర్శకులతో కంటే కూడా అప్పుడే సక్సెస్ అందుకున్న చిన్న దర్శకులను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. తనకు కనెక్ట్ అయితే సింగిల్ సిట్టింగ్ లోనే ఒప్పేసుకుంటాడు కూడా. ఇక అదే తరహాలో ఒకప్పుడు కందిరీగ దర్శకుడు కూడా బాగా కనెక్ట్ అయ్యాడు.
Recommended Video
మొదటి సినిమాతోనే..
రామ్ పోతినేనితో కందిరీగ సినిమాను డైరెక్ట్ చేసిన సంతోష్ శ్రీనివాస్ మంచి బాక్సాఫీస్ హిట్ అందుకొని మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ తనవైపు తిరిగేలా చేసుకున్నాడు. అయితే ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో రభస అనే సినిమా చేసిన ఈ దర్శకుడు ఊహించని డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. అనంతరం మళ్ళీ రామ్ తో హైపర్ సినిమా చేసి కాస్త పరవాలేదు అనిపించాడు.
ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు
ఈ దర్శకుడు మొదట సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసి ఆ తరువాత దర్శకుడిగా మారాడు. అయితే ఈ సారి ఎలాగైనా అల్లుడు అదుర్స్ సినిమాతో బాక్సాఫిస్ హిట్ అందుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సంతోష్ ఈ సినిమా రిజల్ట్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు చెప్పాడు. తప్పకుండా సినిమాక్ అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందని అన్నాడు.
పవన్ తో సినిమాక్ ఫిక్స్ అయ్యింది.. కానీ..
అయితే ఈ దర్శకుడు కొన్నేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఖుషి నిర్మాత ప్రొడక్షన్ లోనే వీరి కాంబో కలిసే ఛాన్స్ ఉన్నట్లు అప్పట్లో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. కానీ స్క్రిప్ట్ అంతగా నచ్చలేదని నిర్మాతనే ఆ కాంబినేషన్ ను క్యాన్సిల్ చేసినట్లుగా కూడా మరికొన్ని రూమర్స్ వచ్చాయి.
పవర్ స్టార్ తో ఒక సినిమా.. తప్పకుండా...
ఆ తరువాత పవన్ క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల అల్లుడు అదుర్స్ సినిమా కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో సంతోష్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ సినిమాపై ఒక క్లారిటీ ఇచ్చాడు. తప్పకుండా ఆయనతో ఒక సినిమా ఉంటుందని అంటూ అందులో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. అలాగే రామ్ కందిరీగ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పాడు.