కొత్త తరం ఆలోచనలును నీటుగా అందంగా తెరకెక్కించి వరసగా హిట్లు ఇస్తున్న న్యూజనరేషన్ దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన తొలిగా 'ఆనంద్' వంటి రొమాంటిక్ కామిడీ తీసి తెలుగు వారిని ఆకట్టుకున్నారు. తర్వాత అదే ఎనర్జీతో 'గోదావరి','హ్యాఫీడేస్' తీసి సూపర్ హిట్ సినిమానిచ్చారు. తరువాత ఏ సినిమా ప్రారంభించలేదు. స్క్రిప్టుని పూర్తిగా నమ్మే ఆయన ఆ బిజీలో ఉన్నారు. ప్రస్తుతం అది పూర్తి చేసుకుని కొత్త సినిమాని కమిట్ అయ్యారని తెలుస్తోంది. ఆ నిర్మాత వేరెవరో కాదు...కరుణాకరన్ తో 'ఉల్లాసంగా...ఉత్సాహంగా' నిర్మించిన సోము. వారి అమర్ నాధ్ ఆర్ట్స్ బ్యానర్ పైనే ఈ సినిమా తీయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకీ రొమాంటిక్ కామిడీనే ఎన్నుకున్న శేఖర్ ...మళ్ళీ కొత్త వారితోనే చెయ్యబోతున్నారని అనుకుంటున్నారు. ఇక ఉల్లాసంగా చిత్రాన్ని దిల్ రాజు తన పంపిణీ సంస్ధ ద్వారా రిలీజ్ చేయనున్నారు.