»   » నీకు ఛాన్స్ ఇస్తే బదులుగా నాకేం ఇస్తావు అన్నాడు: నేను కూడా సెక్స్‌ టార్చర్‌ ఎదుర్కొన్నా..!

నీకు ఛాన్స్ ఇస్తే బదులుగా నాకేం ఇస్తావు అన్నాడు: నేను కూడా సెక్స్‌ టార్చర్‌ ఎదుర్కొన్నా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చూడగానే... పక్కింటి సాధారణ అమ్మాయిలా కనిపిస్తుంది. ఒక్కసారి మాట్లాడితే ఆమె కళాహృదయం గురించి తెలుస్తుంది. దగ్గరగా చూసినవారికి మాత్రమే తనలోని సృజన అర్థమవుతుంది. ఆమె... నటి, శిల్పి, డిజైనర్‌ లేఖా వాషింగ్టన్‌. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ బాషల్లో నటించిన లేఖ... తమిళియన్.

'వేదం' సినిమాలో మంచు మనోజ్‌ రాక్‌బ్రాండ్‌లో మ్యుజీషియన్‌గా కనిపించిన లేఖ...పలువురు హీరోయిన్లు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో నోరు విప్పుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళ నటి అయిన లేఖా వాషింగ్టన్.. ఓ నిర్మాత తనను పడకగదికి పిలిచాడనే విషయాన్ని బయటపెట్టింది. మంచి హిట్స్ లేకపోవడంతో.. సాదాసీదా సినిమాల్లో నటిస్తూ.. మరోవైపు ఓ సంస్థను నిర్వహిస్తున్న లేఖా వాషింగ్టన్‌కు.. సినీ ఇండస్ట్రీలో చేదు అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చింది.

Director Sex Torture To Heroine Lekha Washington

అందం, అభినయం ఉన్నా విజయాలు దక్కక హీరోయిన్‌గా ఆమె కెరీర్‌ ఆశించిన స్థాయిలో సాగలేదు. ఇప్పుడు ఆమె ఖాతాలో ఒక్క సినిమా కూడా లేదు. చివరిగా ప్రసన్నకు జోడీగా 'కల్యాణ సమయల్‌ సాదమ్‌' చిత్రంలో కనిపించిన లేఖా తాజాగా బాంబు పేల్చింది. లైంగిక వేధింపులకు గురైన హీరోయిన్లలో తానూ ఉన్నానని, సెక్స్‌ టార్చర్‌ను తానూ అనుభవించానని ఓపెన్‌గా ప్రకటించి సంచలనం సృష్టించింది.

Director Sex Torture To Heroine Lekha Washington

భావన కిడ్నాప్‌, లైంగి దాడి ఉదంతం తరువాత హీరోయిన్లు ఒక్కొక్కరుగా తమకు ఎదురైన చేదు అనుభవాలను బహిరంగపరుస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో లేఖా కూడా చేరింది. సినిమాలో అవకాశం ఇస్తానని ఒక తమిళ దర్శకుడు సెక్స్‌ టార్చర్‌ చేశాడని చెప్పింది. కథ చెప్పిన తరువాత 'ఈ సినిమాలో నీకు ఛాన్స్ ఇస్తే బదులుగా నాకేం ఇస్తావు?' అనడిగాడని, అతని దుర్భుద్ధి తనకు అర్థమైనా తెలియనట్టు నటిస్తే పదే పదే అదే ప్రశ్న వేస్తూ విసిగించాడని ఆక్రోశంగా చెప్పింది. సినిమా నటిగా జీవించడం సులభమైన విషయం కాదని, ఎన్నో సవాళ్లును ఎదుర్కొంటూనే ఉంటారని లేఖ వాపోయింది.

English summary
actress Lekha washington Who played a role with manchu Manoj in VEDAM says that she faced Sex Torture Wth a kollywood Director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu