సునీల్ మాత్రమే కనిపిస్తాడు..!
Recommended Video

సునీల్, మనీషా రాజ్ జంటగా నటిస్తున్న చిత్రం 2 కంట్రీస్. మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఎన్.శంకర్ స్వీయ దర్శక నిర్మాణంలో సినిమాను రూపొందించారు. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో నాని ఆడియో సీడీలను విడుదల చేశారు.
డైరెక్టర్ ఎన్.శంకర్ మాట్లాడుతూ- ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకోగానే..సునీల్ అయితేనే చేయాలని ముందుగా అనుకున్నాను. ఆ రైట్స్ కొనాలని అనుకుంటున్న తరుణంలో బండ్ల గణేష్ రైట్స్‌ను దక్కించుకున్నాడు. సరేనని కామ్‌గా అయిపోయాను. ఈ సినిమాను తెలుగులో నేనే చేయాలని రాసి ఉందేమో..అటు, ఇటు తిరిగి నా దగ్గరకే వచ్చింది. చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా కదా! అని ఆలోచించి సినిమా చేశాను. గోపీ సుందర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. రీ రికార్డింగ్ ముగియగానే మలయాళం కంటే తెలుగులో సినిమా అద్భుతంగా వచ్చిందని తనే నా దగ్గర అన్నాడు. ఇక సునీల్ విషయానికి వస్తే, తనొక ట్రాన్స్‌ఫర్మర్. తను ఓన్ చేసుకుని నటించాడు. రేపు సినిమా చూసిన వారందరికీ సునీల్ తప్పకుండా గుర్తుంటాడు. హార్ట్ టచింగ్‌తో పాటు హ్యూమన్ వాల్యూస్ ఉన్న చిత్రమిది. చీకటిని చీకటి జయించదు. వెలుగే జయిస్తుంది. అలాగే ద్వేషాన్ని ద్వేషం జయించదు. ప్రేమ మాత్రమే జయిస్తుంది. ఇప్పటి యువత వేగ వంతమైన జీవితంలో పడి చాలా విషయాలను మరచిపోతున్నారు. అందులో నిజమైన ప్రేమ ఒకటి. నిజమైన ప్రేమ గుండెను తాకితే ఎలా ఉంటుందో తెలిపే చిత్రమే ఇది. సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అన్నారు.


Click it and Unblock the Notifications











