ఎట్టకేలకు రజనీకాంత్ ‘2.0’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది!

By Bojja Kumar

Recommended Video

Rajinikanth's 2.0 Release Date Fix

రజనీకాంత్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న '2.0' మూవీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఖరారైంది. ఈ చిత్రాన్ని నవంబర్ 29, 2018న విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు శంకర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా ఇంతకాలం సినిమా విడుదల ఆలస్యం కావడానికి గల కారణాలు కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. మరో వైపు ఈ చిత్రంలో విలన్ పాత్ర చేస్తున్న అక్షయ్ కుమార్ కూడా మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ట్వీట్ చేశారు.

విఎఫ్ఎక్స్ వల్లే లేటు...

విఎఫ్ఎక్స్ వల్లే లేటు...

గతేడాది విడుదల కావాల్సిన ‘2.0' చిత్రం విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక పోవడం వల్లనే వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వర్క్ ఓ కొలిక్కిరావడంతో ‘నవంబర్ 29'న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

వారు ప్రామిస్ చేశారని చెప్పిన శంకర్

ఎట్టకేలకు విఎఫ్ఎక్స్ కంపెనీలు విఎఫ్ఎక్స్ షాట్స్ డెలివరీ విషయంలో ప్రామిస్ చేశారు. వారు నమ్మకంగా చెప్పారు కాబట్టి సినిమాను నవంబర్ 29న విడుదల చేయబోతున్నాం' అంటూ శంకర్ ట్వీట్ చేశారు.

అక్షయ్ కుమార్ ట్వీట్

2.0 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో ఇండియాలో ఇప్పటి కనీవీని ఎరుగని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. రజనీకాంత్‌ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై ఇటు సౌత్‌లో, అటు నార్త్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ప్రమోషన్స్ జోరు..

ఇక ప్రమోషన్స్ జోరు..

సినిమా రిలీజ్ ఆసల్యం కావడం వల్ల ఇంతకాలం ప్రమోషన్స్ నిర్వహించడం పూర్తిగా తగ్గించేసిన నిర్మాతలు మళ్లీ ప్రేక్షకుల్లో ఈ మూవీపై అటెన్షన్ పెంచే ఆలోచలో ఉన్నారట. ఆగస్టు నుండి సినిమా ప్రమోషన్స్ జోరందుకోనున్నట్లు సమాచారం. టీజర్, ట్రైలర్, దేశంలోని వివిధ నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రోబో 2.0

రోబో 2.0

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా పాత్ర పోసించడం సినిమాకు హైలెట్ కానుంది. రజనీకాంత్, అమీ జాక్సన్ రోబోలుగా కనిపించబోతున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వేలాది థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X