twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగ్‌లో భారీ ప్రమాదం.. 75 మందికి గాయాలు, ఏడ్చేసిన దర్శకుడు శంకర్ .. బయటపెట్టిన స్టంట్ మాస్టర్!

    |

    దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్ర రాజాం అపరిచితుడుని ఎవరూ మరచిపోలేరు. అత్యంత క్లిష్టమైన సందేశాత్మ కథని దర్శకుడు శంకర్ అన్ని కమర్షియల్ అంశాలతో తెరకెక్కించి అద్భుతమే చేశాడు. ఈ చిత్రం పలు జాతీయ అవార్డులు సైతం కొల్లగొట్టింది. ఇండియా ఎందుకు వెనకబడిపోతోంది, భారత పౌరులుగా మనమంతా ఎలా భాద్యతగా నడుచుకోవాలి వంటి సందేశాత్మక అంశాలని ఈ చిత్రంలో శంకర్ చూపించారు. అన్ని వర్గాల ప్రేక్షకులని ఈ చిత్రం ఉర్రూతలూగించింది.

    2005 లో విడుదలైన ఈ చిత్రం రికార్డులు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. మూడుపాత్రలో అద్భుతంగా నటించిన విక్రమ్ పేరు మారుమోగింది. ఈ చిత్రం వెనుక ఉన్న కష్టాన్ని తాజాగా స్టంట్ డైరెక్టర్ సిల్వ గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సందర్భంలో జరిగిన ప్రమాదం వలన శంకర్ చిన్న పిల్లాడిలా ఏడ్చేశారని సిల్వ తెలిపాడు.

    అతిపెద్ద ప్రమాదం

    అతిపెద్ద ప్రమాదం

    అపరిచితుడు చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ ఫైట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఆ ఫైట్ చిత్రీకరణ సమయంలో జరిగిన అతి పెద్ద ప్రమాదాన్ని సిల్వ వివరించారు.

    Recommended Video

    2.0 ఆలస్యానికి అసలు కారణం ఇదే
    150 మంది స్టంట్ మెన్స్

    150 మంది స్టంట్ మెన్స్

    ఆ ఫైట్ కోసం దాదాపు 150 మంది స్టంట్ మేన్స్ ని ఉపయోగించాం. సినిమా మొత్తానికి ఆకర్షణగా నిలిచిన ఫైట్ అది. విక్రమ్ ఒక్కడే వారందరితో పోరాడే సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించారు.

     శంకర్ చెప్పక ముందే

    శంకర్ చెప్పక ముందే

    ఆ ఫైట్ చిత్రీకరణ సమయంలో దాదాపు 75 మంది స్టంట్ మెన్స్ గాల్లో ఎగరాల్సి ఉంటుంది. ఓ లారీకి తాడులు కట్టి వారంతా గాల్లో ఎగిరేలా ప్లాన్ చేసాం. శంకర్ యాక్షన్ చెప్పక ముందే డ్రైవర్ అనుకోకుండా లారీని కదిలించాడు. అప్పటికి స్టంట్ మెన్స్ సిద్ధంగా లేరు.

    రక్తం కారేలా

    రక్తం కారేలా

    డ్రైవర్ చేసిన పొరపాటు వలన స్టంట్ మెన్స్ స్టేడియం టాప్ తగిలి కింద పడ్డారు. అందరికి గాయాలయ్యాయి. కొందరికి కంటి భాగంలో కూడా రక్తం కారింది. కొందరికి ఫిడ్స్ కూడా వచ్చింది. వేగంగా స్పందించడం వలన అందరిని రక్షించుకున్నాం అని సిల్వా తెలిపాడు.

    చిన్న పిల్లాడిలా ఏడ్చారు

    చిన్న పిల్లాడిలా ఏడ్చారు

    దర్శకుడు శంకర్ ఆ సమయంలో చిన్న పిల్లాడిలా ఏడ్చేశారని సిల్వా తెలిపాడు. ఆయన్ని చూసి నేను కూడా తట్టుకోలేక పోయా అని సిల్వ తెలిపాడు. 2005 లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొంది అఖండ విజయం సాధించింది.

    English summary
    Director Shankar Cried Very Badly says Stunt Master Silva. He remembers Aparichithudu memories
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X