మహేష్ పాటని శంకర్ మెచ్చుకున్నాడు..ఫుల్ హ్యాపీ

By Srikanya

హైదరాబాద్ : జెంటిల్ మెన్, భారతీయుడు, అపరిచితుడు అంటూ వరసగా భారీ చిత్రాలు,భారీ విజయాలు నమోదు చేసుకున్న దర్శకుడు ఎవరూ అంటే కళ్లు మూసుకుని శంకర్ అనే చెప్పేటంత గుర్తింపు ఉంది. ఆయన ఓ తెలుగు పాటని విని అద్బుతం,మైండ్ బ్లోయింగ్ అని మెచ్చుకున్నాడంటే ఆ సంగీత దర్శకుడు ఆనందం ఏమని చెప్పగలం. ఇప్పుడు అలాంటి ఆనంద స్దితిలోనే ఉన్నాడు తమన్. మరో విశేషం ఏమిటంటే..గతంలో శంకర్ బాయ్స్ చిత్రం ద్వారా తమన్ నటుడుగా పరిచయమయ్యారు.

శంకర్ రీసెంట్ గా ట్వీట్ చేస్తూ..." తమన్..నేను మీ దూకుడు మ్యూజిక్ చూసాను..మైండ్ బ్లోయింగ్... యూఎస్ లో కారు ట్రావెల్స్ లో వెళుతూ ఎంజాయ్ చేస్తున్నాను... ముఖ్యంగా ఇటు రాయే పాట నా ఫేవెరెట్ " అన్నారు. దీనిపై వెంటనే...తమన్ స్పందిస్తూ...తన సంతోషం వెల్లబుచ్చాడు. ఇప్పుడు దూకుడు సూపర్ కంప్లీట్ అయినట్లు అన్నాడు.

Director Shankar Loves Thaman's Dookudu Songs

ప్రస్తుతం శంకర్ తన ఐ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ బిజీలో ఉన్నారు. శంకర్ సినిమాలంటే తమిళంలోనే కాదు,తెలుగులోనూ మంచి క్రేజు. బ్లాక్‌బస్టర్‌ దర్శకుడిగానే కాదు, భారీ బడ్జెట్‌ చిత్రాల మేకర్‌గా కూడా శంకర్‌కు పేరుంది. ఆయన రూపొందించిన వాటిలో బాయ్స్‌ మినహా జెంటిల్‌మేన్‌, ప్రేమికుడు‌, భారతీయుడు‌, ఒకే ఒక్కడు‌, అపరిచితుడు‌, నన్బన్‌ ఆ కోవకు చెందినవే. ప్రస్తుతం విక్రమ్‌ హీరోగా 'ఐ' రూపొందిస్తున్నాడు. ఎమీ జాక్సన్‌ 'చియాన్‌' సరసన ఆడిపాడుతోంది.

'అపరిచితుడు'గా విక్రంను తీసుకువచ్చి దక్షిణాదికే సుపరిచితం చేసిన శంకర్‌.. మళ్లీ 'ఐ'తో మరో విజయాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. 'ఐ' కోసం నటుడు విక్రం సకలవిధాలా తనను తాను మలుచుకుంటున్నారు. కథకు తగ్గట్లు తన శరీరాకృతిని మార్చుకుంటున్నారట. మూడు భిన్న కోణాల్లో విక్రం కనిపించనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X