For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'ఐ' డైరక్టర్ శంకర్ పెళ్లి లో... (రేర్ ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు శంకర్ ..వివాహం ఫొటో ఇది. అప్పటి ఆయన వివాహానికి ఛీఫ్ మినిస్టర్ జయలలిత హాజరయ్యారు. ఆయన భార్య ఈశ్వరి గెస్ట్ లను ఆహ్వానిస్తూ బిజీగా ఉండటం గమనించవచ్చు. ఈ ఫొటో ఇప్పుడు శంకర్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ ఫొటోని మీరు చూడండి.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఇక శంకర్ తాజా చిత్రం 'ఐ' పాజిటివ్ టాక్ తెచ్చుకోకపోయినా కలెక్షన్ విషయంలో అదరకొడ్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు భాషల్లోనూ విడుదలైంది. కోర్టు కేసు, అప్పుల సమస్యతో ఈ చిత్రం విడుదల కావడం ఇంతకాలం జాప్యమైంది. ఈ కష్టాల నుంచి బయటపడి ఎట్టకేలకు చిత్రం సంక్రాంతి కానుకగా బుధవారం తెరపైకొచ్చింది.

  Director Shankar's Wedding Photo!

  అమెరికా, జపాన్‌, చైనా తదితర పలు దేశాల్లో సుమారు 2,500 థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. తొలిసారిగా పాకిస్థాన్‌లో తమిళుల చిత్రం హిందీలో అనువాదమై విడుదలైంది. తమిళనాట మాత్రం సుమారు 400 థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రంలో కథానాయకుడు విక్రమ్‌ సరసన ఎమీజాక్సన్‌ నటించింది. మూడు సంవత్సరాల పాటు నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం కోసం నటుడు విక్రమ్‌ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

  సన్నివేశాలకు తగ్గట్టుగా తన శరీర బరువును తగ్గించడం, పెంచడం చేశారు. ఓ విధంగా చెప్పాలంటే ఈ చిత్రం కోసం తనను తాను అంకితం చేసుకున్నారు. ఆయన ఈ శ్రమ వృథా కాలేదని చిత్ర బృందం పేర్కొంది.

  విక్రమ్‌ ఈ చిత్రంలో భిన్న పాత్రల్లో కన్పించారు. ఓ వైపు బాడీబిల్డర్‌ లింగేశ్వర్‌ పాత్ర కోసం బరువు పెరిగి... మళ్లీ గూనివాడి పాత్ర కోసం పూర్తిగా తగ్గారు. సైకిల్‌ హీరోయిన్‌గా మారడం, నోకియా ఫోన్‌ డ్రెస్‌లో కధానాయికను చూపించడం వంటి శంకర్‌ మార్క్‌ మాయాజాలం ఈ చిత్రంలోనూ చూడవచ్చు. ఈ చిత్రాన్ని ఆస్కార్‌ ఫిలిమ్స్‌ పతాకంపై ఆస్కార్‌ రవిచంద్రన్‌ నిర్మించగా తెలుగులో మెగా సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ విడుదల చేసారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. అమీజాక్సన్‌ హీరోయిన్.

  చేతి వేళ్లకు పూలు పూయడం, ఒంటిపై సీతాకోక చిలుకలు వాలడం, ప్రపంచ వింతలను ఒకే పాటలో చూపించడం ఇవన్నీ ఎక్కడ చూడవచ్చు అంటే సినీ పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా టక్కున చెప్పేది శంకర్‌ సినిమాలో అని. అందుకు తగినట్లే ఆయన సినిమాలు ఉంటాయి.

  శంకర్‌ ప్రదర్శించిన మరో మాయాజాలం 'ఐ'. విక్రమ్‌ నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవల ఎక్కడకి వెళ్లినా ఈ చిత్రంలోని గీతాలే వినిపిస్తున్నాయి. విక్రమ్‌ గెటప్‌లు, అమీజాక్సన్‌ అందచందాలు, అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసారు. సురేష్‌గోపి, ఉపేన్‌పటేల్‌, సంతానం, రాంకుమార్‌ గణేషన్‌, శ్రీనివాసన్‌, సయ్యద్‌ సిద్ధిక్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్‌, కూర్పు: ఆంటోని, సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌

  English summary
  Watch out the exclusive wedding pic of South India's ace filmmaker Shankar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X