కూతురి పెళ్లికి కూడా భారీగా ఖర్చు చేసిన డైరెక్టర్ శంకర్.. ఆ బడ్జెట్‌తో ఒక సినిమా తీసేయొచ్చు!
సంచలన దర్శకుడు శంకర్ ఎలాంటి సినిమా చేసినా కూడా బడ్జెట్ భారీగా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. పాట కోసమే కోట్ల రూపాయలను మంచి నీళ్ళలా ఖర్చు చేస్తుంటారు. ఇక ఇంట్లో పెళ్లిని కూడా శంకర్ అదే తరహాలో ఆలోచించి భారీగా సెలబ్రేట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన లెక్కలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే...

ఆ ఫార్ములాతోనే అగ్ర దర్శకుడిగా
దర్శకుడు శంకర్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు అతను ఆకలి బాధను కూడా చూశాడు. ఇక డైరెక్టర్ అయిన తరువాత అతను ఎదుర్కొన్న ఎన్నో చేదు అనుభవాలను సినిమాల రూపంలో చూశాడు. ఆ ఫార్ములాతోనే అగ్ర దర్శకుడిగా కొనసాగుతూ వచ్చారు.

మొదటి సినిమాకే భారీ బడ్జెట్
ఇండియన్, అపరిచితుడు, శివాజీ, రోబో వంటి సినిమాలతో ఎప్పటికప్పుడు రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచుకుంటూ వచ్చాడు. శంకర్ సినిమాలకు పెట్టె బడ్జెట్ మాములుగా ఉండదు. మొదటి సినిమా జెంటిల్ మెన్ కోసమే అప్పట్లో కోటికి పైగా ఖర్చు చేశారు. అప్పట్లో ఏ దర్శకుడు కూడా మొదటి సినిమా కోసం ఆ లెవెల్లో ఖర్చు చేసింది లేదు.

పాటల కోసమే కోట్ల రూపాయలు
శంకర్ పాటల కోసం ఈజీగా 5కోట్లు దాటుతాయి. దేశ విదేశాలు తిరిగి మంచి లొకేషన్స్ చూస్తారు. ఇక సినిమాలకు ఆయన చేయించే ఖర్చు కూడా మామూలుగా ఉండదు. సినిమా మొదలైనప్పుడు ఒక బడ్జెట్ అనుకుంటే.. సినిమా షూటింగ్ అనంతరం మరొక బడ్జెట్ కనిపిస్తుంది. రోబో తరువాత మళ్ళీ ఆ సినిమాకు వచ్చిన సీక్వెల్ కు కూడా అత్యదిక బడ్జెట్ కేటాయించారు.

కూతురి పెళ్లి కోసం కూడా
ఇక కూతురి పెళ్లికి కూడా శంకర్ భారీ స్థాయిలో ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ వేడుకకు తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు మరికొందరు స్టార్ సెలబ్రెటీలు కూడా వచ్చారు. కోవిడ్ వలన ఎక్కువమంది హాజరు కాలేకపోయారు. లేకపోతే శంకర్ మరింత గ్రాండ్ గా నిర్వహించేవారు.

ఖరీదైన నగలు
ఐశ్వర్య, క్రికెటర్ రోహిత్ వెడ్డింగ్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ఇక వేడుకను ఒక ఖరీదైన రిసార్ట్ లోనే నిర్వహించారు. ఒక వారం ముందుగానే కుటుంబ సభ్యులకు కోవిడ్ టెస్టులు చేయించారు. శంకర్, కూతురికి కోట్లాది రూపాయల విలువైన నగలు కూడా చేయించారట.
Recommended Video

మొత్తం ఖర్చు ఎంతంటే..
ఇక కూతురు ఐశ్వర్య పెళ్లి కోసం దర్శకుడు శంకర్ ఏ మాత్రం తక్కువ కాకుండా దాదాపు రూ.10కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. అంటే దాదాపు ఆ బడ్జెట్ తో ఒక మంచి సినిమా తీసేయొచ్చు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక శంకర్ తన తదుపరి సినిమాను రామ్ చరణ్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











