వారి కెమిస్ట్రీ, ఫిజిక్స్ కెమెరా ముందూ, వెనుక బాగా నడుస్తోంది...!
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న '3 ఇడియేట్స్' తమిళ, తెలుగు రీమేక్ సినిమా రెండో షెడ్యులు పూర్తయింది. డెహ్రాడూన్ లో జరిగిన ఈ షూటింగులో కాలేజీకి సంబంధించిన ఎక్స్ టీరియర్ సన్నివేశాలను చిత్రీకరించినట్టు శంకర్ చెప్పారు. విజయ్, ఇలియానా, సత్యరాజ్ లతో పని చేయడం కొత్త అనుభవమని ఆయన తెలిపారు. విజయ్, సత్యరాజ్ కాంబినేషన్ ఫ్రెష్ గానే కాకుండా ఫెంటాస్టిక్ గా కూడా ఉంటుందని శంకర్ చెప్పారు. 3 ఇడియట్స్ రీమేక్ రెండు షెడ్యూల్స్ విజయవంతగా పూర్తిచేశాం.
సినిమా పరిభాషలో ఎక్కువగా వాడే 'కెమిస్ట్రీ' గురించి చెబుతూ, 'విజయ్, జీవా, శ్రీకాంత్ ల కేమిస్ట్రీయే కాదు, పిజిక్స్ కూడా బాగా వర్కౌట్ అయింది. కెమెరా ముందే కాదు, వెనుక కూడా..! అంటూ జోక్ చేశారు. జెమిని ఫిలిం సర్క్యుట్స్ బ్యానర్ పై జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళికి రిలీజ్ చేయడానికి ప్లాన్ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











