ఈస్ట్ గోదావరిలో RC 15 షూటింగ్.. ఆ సెంటిమెంట్ తో ఫ్యాన్స్ ఖుషీ.. అప్పుడే దిగిపోయిన శంకర్ టీమ్!
రామ్ చరణ్ అభిమానులందరికీ మాంచి కిక్ ఇచ్చే ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. తాజాగా శంకర్‌తో చేయబోతున్న సినిమా షూటింగ్ వివరాలు బయటకు వచ్చాయి. ఇక ఇక్కడే రంగస్థలం సినిమాతో ఉన్న ఒక కనెక్షన్ కూడా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

రెండు సినిమాలతో బిజీగా
బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ తేజ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా RRRలో హీరోగా నటించారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 28వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. నిజానికి ఈ సినిమా జరుగుతూ ఉండగా రామ్ చరణ్ తన తండ్రి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటించారు.

ఫిబ్రవరి 10 నుంచి కొత్త షెడ్యూల్
అయితే రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని ప్రస్తుతం RC15 గా పిలుస్తున్నారు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ ఇప్పటికే ముంబై పరిసర ప్రాంతాల్లో పూర్తయింది. అక్కడ ఒక సాంగ్ షూటింగ్ కూడా చేశారని ప్రచారం జరుగుతూ వస్తోంది.. అయితే తాజా సమాచారం మేరకు సినిమాకి అవసరమైన అనుమతులు లభిస్తే ఫిబ్రవరి 10 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ షూటింగ్ జరగనుంది.

బందోబస్తు కోసం
ఇప్పటికే శంకర్ సహా శంకర్ టీమ్ లోని కొంతమంది కీలక సభ్యులు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న దోసకాయల పల్లి అనే గ్రామానికి చేరుకున్నారు. అంతేకాక 31వ తేదీ జనవరి నెలలో ఏలూరు రేంజ్ డిఐజి కి ఈ మేరకు లేఖ కూడా రాశారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రాజమండ్రి, కాకినాడ, కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉందని పోలీస్ శాఖ నుంచి ఒక ఎస్సై తో కూడిన బృందాన్ని తమ బందోబస్తు కోసం పంపాల్సిందిగా సినిమా యూనిట్ కోరారు.

అంచనాలు
దానికి సంబంధించిన చార్జీలు ఏమైనా అయితే తాము సహకరిస్తామని, కరోనా నిబంధనలు అనుసరించి షూటింగ్ జరుపుతామని లేఖలో పేర్కొన్నారు. రామ్ చరణ్ చివరి సారిగా రంగస్థలం కోసం ఈ ప్రాంతంలో షూట్ చేసాడు. అక్కడ షూటింగ్ చేసిన రంగస్థలం సినిమా సూపర్ హిట్ కావడంతో రాంచరణ్ శంకర్ సినిమా మీద కూడా ఇప్పుడు అభిమానులు మంచి అంచనాలు పెట్టేసుకున్నారు. ఆచార్య షూట్ కొంత ఇక్కడే జరిగింది.

అద్భుతమైన విజయం
ఇక్కడ మొత్తం పద్దెనిమిది రోజుల షెడ్యూల్ అని అంటున్నారు. అయితే ఇది పాట కోసమా లేదా టాకీ పార్ట్ షూట్ ఉంటుందా అనేది ఖచ్చితంగా తెలియదు. ఏదైతే నేమి తమకు కలిసి వచ్చిన రంగస్థలం సినిమా షూటింగ్ జరిగిన ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ కూడా జరిగితే కచ్చితంగా ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం అందుకుంటుందని వారు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











