Kamal Haasan సినిమా సూపరంటూ శంకర్ ప్రశంసల వర్షం.. ఒక్క ట్వీట్ తో లైన్లోకి ఇండియన్ 2?

లోకనాయకుడు కమల్ హాసన్ చాలా కాలం తర్వాత ఒక సాలిడ్ హిట్ కొట్టారు. ఇటీవల విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ హాసన్ అటు తమిళంలోనే కాక తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం 'విక్రమ్' ఫిల్మ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కమల్ హాసన్ దర్శకుడు లోకేష్ కనకరాజు కు ఒక అద్భుతమైన వాహనాన్ని కూడా బహుమతిగా అందించాడు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు చక్కటి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ కూడా చూశారు. సినిమా చూడడమే కాక ఆయన విక్రమ్ టీమ్ పైన ప్రశంసల వర్షం కురిపించారు.

కమల్ హాసన్ వెండితెరపైన 360 డిగ్రీల్లో నిజమైన లెజెండ్ గా కనిపించారని, డైరెక్టర్ లోకేశ్ చాలా కష్టపడి సినిమాను బాగా తీశారని శంకర్ ట్వీట్ చేస్తూ ప్రశంసించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, యాక్షన్ మాస్టర్స్ అన్బరివ్ అందరికీ కుడోస్ అంటూ దర్శకుడు శంకర్ తన ట్వీట్ లో పేరు పేరునా అందరినీ టచ్ చేశారు. అంతే కాక టీమ్ మొత్తానికి నమస్కారం పెట్టినట్లు సింబల్ పెట్టి ట్వి్ట్టర్ వేదికగా శంకర్ ట్వీట్ చేయడం చర్చనీయాంశం అయింది. ఎందుకంటే శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా చేయాల్సి ఉంది. అయితే సినిమా షూటింగ్ సమయంలో క్రేన్ కూలి కొంత మంది దుర్మరణం పాలు కావడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది.

Director Shankar tweets about Kamal Haasan starrer Vikram gone viral.

ఇక ఆ తర్వాత సినిమా షూటింగ్ మొదలు కావడానికి అనేక బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. అంతేకాక కమలహాసన్ విక్రమ్ మధ్య భేదాభిప్రాయాలు కూడా ఏర్పడ్డాయి అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక రకంగా ఈ ట్వీట్ కారణంగా ఇండియన్ 2 మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే లైకా సంస్థ శంకర్ కమల్ హాసన్ మధ్య ఏర్పడిన చిన్నపాటి మనస్పర్థలు తొలగించి సినిమా ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విక్రమ్ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో అది తమ సినిమాకి కలిసి వచ్చే అంశంగా శంకర్ భావిస్తున్నాడని సమాచారం. శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో RC15 ఫిల్మ్ చేస్తున్నారు. ఈ పిక్చర్ తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్ తో 'ఇండియన్-2' చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. రామ్ చరణ్ శంకర్ సినిమాకూ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో అది శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే శంకర్ కమల్ హాసన్ తో సినిమా చేసే అవకాశం ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X