‘దరువు’కి మూలం చిరు సినిమానే అని ఒప్పుకున్నాడు
రవితేజ తాజా చిత్రం 'దరువు'.. చిరంజీవి 'యముడికి మొగుడు' కాపీ కొట్టి కథ అల్లారని టాక్ వచ్చింది. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ దర్శకుడు ...''యముడికి మొగుడు' నా ఫేవరెట్ ఫిలిం. ఆ సినిమాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్న మాట నిజమే. ఇందులో హోమ్ మినిస్టర్ ఎపిసోడ్ చాలా కొత్తగా ఉంటుంది. కథలో ఆ కేరక్టర్ నచ్చే రవితేజ గారు చేయడానికి అంగీకరించారు'' అన్నారు.
అలాగే 'దరువు' చిత్రం మంచి విజయం సాధించిందని చెప్తూ... ''సాధారణంగా మన హీరోలు ఆయుధాలతో యుద్ధం చేస్తారు. కానీ మా 'దరువు' సినిమాలో రవితేజ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఫైట్ చేశారు. అందుకే థియేటర్లన్నీ నవ్వుల్లో తేలిపోతున్నాయి. రవితేజ ఎనర్జీ ఈ సినిమాకు వంద శాతం హెల్ప్ అయ్యింది. ఆయనతో ఎప్పట్నుంచో ఒక ఎంటర్‌టైనర్ తీయాలనేది నా కోరిక. అది ఇన్నాళ్లకు నేరవేరింది'' అన్నారు. దర్శకుడిగా కె.రాఘవేంద్రరావు, మణిరత్నం తనకు ఆదర్శమనీ, నాగిరెడ్డి శతజయంతి సందర్భంగా విజయా సంస్థ అజిత్ హీరోగా నిర్మిస్తున్న తమిళ చిత్రానికి దర్శకత్వం వహించనున్నానని శివ తెలిపారు.
అలాగే చిత్రంలో హైలెట్స్ చెపుతూ..''బ్రహ్మానందం పోషించిన విద్యాబాలన్ పాత్రకు కూడా ప్రేక్షకుల్లో మంచి స్పందన వస్తోంది. తాప్సీ కూడా ఈ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. తను మంచి క్లాసికల్ డాన్సర్ . అందుకే ఈ సినిమాకు ఎంపిక చేశాం'' అన్నారు.ఇక నిర్మాత శివరామకృష్ణగారు నిర్మించిన 'ప్రేమంటే ఇదేరా' చిత్రానికి నేను అసిస్టెంట్ కెమెరామేన్‌ని. తర్వాత ఆయనే నిర్మించిన 'శ్రీరామ్' చిత్రానికి కెమెరామేన్‌గా ప్రమోట్ అయ్యాను. ఇప్పుడు ఆయన సంస్థలోనే దర్శకుడిగా నిలబడ్డాను. ఇదంతా తలచుకుంటే ఓ కలలా ఉంది'' అన్నారు.
రవితేజ, తాప్సీ కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మించిన చిత్రం 'దరువు'. సౌండ్ ఆఫ్ మాస్ అనే ట్యాగ్ లైన్ తో రూపొంది రెండు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం మార్నింగ్ షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే దర్శకుడు శివ మాత్రం తమ చిత్రం భాక్సాఫీస్ వద్ద రికార్జు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం హిందీ నుంచి,తమిళ్ నుంచి నిర్మాతలు పోటీ పోటి మరీ ఫోన్స్ చేస్తున్నారు అని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











