twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవన్నీ సినిమాలో ఇరికించాల్సిరావటం వల్లే..సింగీతం శ్రీనివాసరావు

    By Srikanya
    |

    వినోదం, సంగీతం, డ్రామా, పోరాటాలూ, మధ్యలో ఓ ప్రత్యేక గీతం...ఇవన్నీ ఒకే సినిమాలో ఇరికించేయాలి. లేదంటే సినిమా నడవదంతే.చిన్న పిల్లల కథలు కూడా పెద్ద వాళ్ల చుట్టూ తిరుగుతాయి. అయినా మన సినిమాల పద్ధతి వేరు...అంటూ ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు పిల్లల సినిమాలు ఎందుకు రావటం లేదనే విషయాన్ని విశ్లేషించారు. బాలల చలన చిత్రోత్సవం సందర్భంగా ఆయన గెస్ట్ గా అటెండయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ.."సినిమా అనేది నూటికి నూరుపాళ్లు వ్యాపారమే. అందులో మనదైన కళ జోడిస్తామంతే. డబ్బులు రావు.. అనుకుంటే ఏ నిర్మాతా సినిమా తీయడానికి సాహసించడు. చిన్న పిల్లల సినిమాలకు అదరణ అభిస్తోంది.. తీయొచ్చు అనే ధీమా నిర్మాతలకు లేనప్పుడు అలాంటివి ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు.

    అలాగే చైనా, ఇరాన్‌ లాంటి దేశాల్లో చిన్న పిల్లల సినిమాలు చూడ్డానికి పెద్దవాళ్లు కూడా ధియేటర్ల ముందు క్యూ కడతారు. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఏ వయసు వారి మనస్తత్వానికి ఏం నచ్చుతాయో మిగతా దేశాల వాళ్లు బాగా పసిగట్టారు. పది సంవత్సరాల లోపు పిల్లలు గంటల తరబడి ధియేటర్లో కూర్చోలేరు. 10 - 15 నిమిషాల తరవాత వాళ్ల ఏకాగ్రత సడలుతుంది. అందుకే చిన్న పిల్లల సినిమాల నిడివి తగ్గించాలి. రెండున్నర గంటలపాటు కథ నడపాలనే పద్ధతి వదిలేయాలి. బాలల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే కథలు తీయాలి. కార్పొరేట్‌ సంస్థలు చిన్న పిల్లల సినిమాలు తీసే బాధ్యత భుజాన వేసుకోవాలి. చిన్న పిల్లల సబ్బులు... బొమ్మలు ఆహార పదార్థాలు ఉత్పత్తులు చేసే సంస్థలు మన దేశంలో చాలానే ఉన్నాయి. ఒక్కో సంస్థ సంవత్సరానికి కనీసం రెండు సినిమాలు తీసినా చాలు. ఆ సంస్థ ప్రచారానికి కూడా ఆయా చిత్రాలు బాగా ఉపయోగపడతాయి అంటూ సూచనలు చేసారు. ఆయన చిత్రాలు ఆదిత్యా 369, భైరవద్వీపం, ఘటోత్కచ, విచిత్ర సోదరులు వంటివి పిల్లలు కూడా ఎగబడి చూసారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X