సింగీతం శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్.. పరిస్థితి ఎలా ఉందంటే?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అత్యంత సీనియర్ దర్శకులతో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. మాయాబజార్ కాలం నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న సింగీతం అంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇష్టమే. ఇక ఈ 88 ఏళ్ల సీనియర్ డైరెక్టర్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఒక్కసారిగా సినీ లోకాన్ని ఈ న్యూస్ షాక్ కి గురి చేసింది. ఇక రూమర్స్ ఎక్కువవ్వకముందే సింగీతం క్లారిటీ ఇచ్చారు.

క్లారిటీ ఇచ్చిన సింగీతం

క్లారిటీ ఇచ్చిన సింగీతం

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు కరోనా వైరస్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కానీ ముందు జాగ్రత్తలు తీసుకున్న వారు ప్రాణాపాయ స్థితి నుంచి తప్పుంచుకున్నారు. ఇక సింగీతం లాంటి పెద్దవారు కరోనా భారిన పడడంతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులను ఆందోళనకు గురి చేయగా ఆయన వెంటనే క్లారిటీ ఇచ్చారు.

నేను బాగానే ఉన్నాను

నేను బాగానే ఉన్నాను

ఈ నెల 9న చెన్నైలో కరోనా పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలిందట. ఇక ఊహాగానాలకు తావివ్వకుండా ముందుగానే సింగీతం ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి ఫేస్ బుక్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నాను అంటూ ఒక వివరణ ఇచ్చారు.

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం నేను ఐసోలేషన్ లోనే ఉన్నాను. అభిమానులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వచ్చే మంగళవారం అంటే సెప్టెంబర్ 22 నాటికి నా క్వారంటైన్ దశ ముగుస్తుంది. 65ఏళ్ళుగా ఎంతో పాజిటివ్ గా ఉన్నాను. కానీ వైద్యులు ఇప్పుడు పాజిటివ్ అని చెబుతున్నారు అంటూ సరదాగా వివరణ ఇచ్చారు.

నెక్స్ట్ సమంతతో సినిమా

నెక్స్ట్ సమంతతో సినిమా

భైరవ ద్వీపం, ఆదిత్య 369 అనే సినిమాలతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సింగీతం శ్రీనివాసరావు సమంతతో ఒక సినిమా చేయడానికి ప్లాన్ వేశారు. 90ల కాలంలో బెంగుళూరుకు చెందిన ఫెమినిస్ట్ నగరత్నమ్మ బయోపిక్ కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశారు. కానీ లాక్ డౌన్ కారణంగా ఆ పనులు ఆగిపోయాయి.

Recommended Video

Bigg Boss Telugu 4 Episode 11 Highlights | Filmibeat telugu
పెరుగుతున్న పాజిటివ్ కేసులు

పెరుగుతున్న పాజిటివ్ కేసులు

గత ఆరు నెలల నుంచి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాలేదు. దేశాల్లో కేసుల సంఖ్య రోజురోజుకు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 50లక్షల కేసులతో భారతదేశం డేంజర్ జోన్ లోకి వచ్చేసింది. ఇక లాక్ డౌన్ సడలింపు కారణంగా చాలా కేసులు పెరుగుతున్నాయు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X