సమంతను ఒక్క రాత్రి ఉండమన్నాం.. రెమ్యునరేషన్ బాగా అడిగింది.. డైరెక్టర్ కామెంట్స్

తాజాగా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టార్ హీరోయిన్ సమంత మొదటి చిత్రం ఏ మాయ చేశావే అని తెలిసిందే. అక్కినేని నాగ చైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీతో ముద్దుగుమ్మ సమంత తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. దీని తర్వాత అనేక మంది అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

ప్రస్తుతం లేడీ ఒరియెంటెడ్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న సమంత మొదటగా ఆడిషన్ ఇచ్చింది ఏ మాయ చేశావే సినిమాకు కాదట. సమంతను తన సినిమాతో పరిచయం చేద్దామనకున్న డైరెక్టర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమెపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

Director Siva Nageswara Rao About Samantha First Audition Over Dochevarevarura

తీవ్రమైన నెగెటివిటీ:స్టార్ హీరోయిన్ సమంత తాజాగా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎపిక్ మైథాలాజికల్ మూవీగా తెరకెక్కిన శాకుంతలం మూవీ ఎట్టకేలకు ఏప్రిల్ 14న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంటోంది. ప్రముఖ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని గ్రాఫికల్ విజువల్స్ పై నెగెటివిటీ వస్తోంది.

ఘోరంగా ట్రోలింగ్:శాకుంతలం సినిమాలోని గ్రాఫిక్స్ పేలవంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్, కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగల్ల కీలక పాత్రల్లో సందడి చేశారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణా టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మించిన ఈ మూవీపై ఘోరంగా ట్రోలింగ్ జరుగుతోంది.

Director Siva Nageswara Rao About Samantha First Audition Over Dochevarevarura

నిన్ను కలిశాక మూవీకి:ఇదిలా ఉంటే స్టార్ హీరోయిన్ సమంత 2010లో వచ్చిన ఏ మాయ చేశావే సినిమాతో పరిచయం అయింది. అయితే దీనికంటే ఒక ఏడాది ముందుగా ఓ సినిమా కోసం ఆడిషన్ కు వచ్చింది సామ్. దానికి సంబంధించిన విషయాలను డైరెక్టర్ శివ నాగేశ్వరరావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. "సమంత అప్పుడు చైన్నైలోని సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుతోంది. నిన్ను కలిశాక సినిమా ఆడిషన్ కోసం ఆమెను హైదరాబాద్ రమ్మని పిలిచాం. ఆమె వచ్చింది" అని శివ నాగేశ్వరరావు చెప్పారు.

బోలెడన్నీ డబ్బులు పెట్టి..:"సమంతను నేనే మొదటగా ఆడిషన్ చేశా. ఆడిషన్ అయిపోయాక సమంతను చెన్నై పంపిద్దామంటే విమాన టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ మరుసటి రోజు కాస్తా తక్కువగా ఉన్నాయి. దీంతో ఒక్క రోజు (రాత్రి) హైదరాబాద్ లో ఉండమని అడిగాం. కానీ అందుకు ఆమె అంగీకరించలేదు. చేసేదేమి లేక మా టీమ్ బోలెడన్నీ డబ్బులు పెట్టి టికెట్ బుక్ చేసి ఆమెను అదే రోజు చైన్నై పంపించింది" అని డైరెక్టర్ శివ నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Director Siva Nageswara Rao About Samantha First Audition Over Dochevarevarura

అద్భుతమైన నటనతో..:"అయితే సమంత ఆడిషన్ మాత్రం చాలా బాగా ఇచ్చింది. సినిమాలో తీసుకునేందుకు మాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఆమె చాలా ఎక్కు రెమ్యునరేషన్ అడిగింది. సమంత అడిగిన పారితోషికం మా బడ్జెట్ పరిధిలో లేదు. అందుకే ఆ పాత్రకు సమంతను ఎంపిక చేయలేదు. కానీ, తన అద్భుతమైన నటనతో ఈ స్థాయికి ఎదిగింది" అని దర్శకుడు, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ శివ నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు.

దోచేవారెవరురా మూవీతో:ఇక డైరెక్టర్ శివ నాగేశ్వరరావు విషయానికొస్తే ఆయన సంచలనాల దర్శకుడు ఆర్జీవీ వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు. 'మనీ', 'మనీ మనీ', 'సిసింద్రీ', 'హ్యాండ్సప్', 'ధనలక్ష్మీ ఐ లవ్ యూ', 'మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. 'ఫొటో' అనే సినిమా ద్వారా హీరోయిన్ అంజలిని పరిచయం చేశారు. 2016లో 'ఓవరాక్షన్' సినిమా చేసిన ఆయన లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సంవత్సరం కొత్త నటీనటులతో 'దోచేవారెవరురా' మూవీతో రానున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X