రామ్ చరణ్, శంకర్ సినిమాలో విలన్ గా పవన్ కళ్యాణ్ డైరెక్టర్.. భయంకరమైన సైకోగా పవర్ఫుల్ రోల్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో మొదటిసారి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ పై కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయంలో కూడా చిత్ర యూనిట్ సభ్యులు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా పాత్రల విషయంలో దర్శకుడు శంకర్ తనకు నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక సినిమాలో ప్రధాన విలన్ కోసం ఇటీవల ఒక సీనియర్ దర్శకుడిని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

RC 15 : చెర్రీ టార్గెట్ ప్యాన్ ఇండియా | Ram Charan Shankar Combo Feast For Fans
 ఆ విషయంలో నో కాంప్రమైజ్

ఆ విషయంలో నో కాంప్రమైజ్

దర్శకుడు శంకర్ ఎలాంటి సినిమా చేసినా కూడా నటీనటులు విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాడని అందరికీ తెలిసిన విషయమే. ఇక రామ్ చరణ్ సినిమా విషయంలో కూడా అంతకుమించి అనేలా శంకర్ ఆలోచిస్తున్నాడు. ఈ సినిమాలో కేవలం ఒక భాషకు చెందిన వారు మాత్రమే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ సినీ ప్రముఖులు ప్రత్యేకమైన పాత్రలో హైలెట్ చేయబోతున్నారు.

 చరణ్ డబుల్ యాక్షన్?

చరణ్ డబుల్ యాక్షన్?

అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా శంకర్ ఈ సినిమాను తెరపైకి తీసుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని కూడా సౌత్ ఇండస్ట్రీ లో టాక్ వైరల్ గా మారుతుంది. ద్విపాత్రాభినయం లో రామ్ చరణ్ ఇదివరకే నాయక్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు శంకర్ సినిమాలో కూడా అదే తరహాలో ఆకట్టుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఐపీఎస్ అధికారిగా శంకర్ చేయబోయే పాత్ర చాలా స్టైలిష్ గా ఉంటుందట.

సరికొత్త మెస్సేజ్

సరికొత్త మెస్సేజ్


రాజకీయాల్లో కొనసాగుతున్న అవినీతిపై హీరో ఎలా పోరాడాడు అనే పాయింట్ ను శంకర్ హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. శంకర్ ప్రతి సినిమాలో ఒక మంచి సందేశం ఉంటుంది. ఇక ఈ సినిమాలో కూడా ఒక సరికొత్త సందేశాన్ని చూపించనున్నారు. సునీల్ తో పాటు సీనియర్ హీరో శ్రీకాంత్ బ్యూటిఫుల్ హీరోయిన్ అంజలి కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు.

మేయిన్ విలన్ గా..

మేయిన్ విలన్ గా..

ఇక మెయిన్ విలన్ గా నటించబోయేది ఎవరు అనే విషయం లో చిత్ర యూనిట్ సభ్యులు కొంత సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల దర్శకుడు శంకర్ ఆ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో తెలుగులో ఖుషి సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్ చేసిన పవన్ కళ్యాణ్ దర్శకుడు ఎస్ జే సూర్యని ఫిక్స్ చేసినట్లు టాక్. అతని పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట.

 హీరో పాత్రతో సమానంగా..

హీరో పాత్రతో సమానంగా..


స్పైడర్ సినిమా లో ఒక విభిన్నమైన పాత్రల్లో కనిపించిన సూర్య ఈ సినిమాలో కూడా దాదాపు అదే తరహాలో కాస్త విభిన్నంగా తన సైకో షేడ్స్ ను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దర్శకుడు శంకర్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో విలన్ పాత్ర హీరోతో సమానంగా హైలెట్ అవుతూ వచ్చింది. ఇక ఈ సినిమాలో దర్శకుడు శంకర్ ఆ పాత్రను సూర్యను ఎలా చూపిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X