Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
'నమో వెంకటేశ' టైటిల్ ఎలా పుట్టిందంటే..
కథ తయారుచేసుకున్న తర్వాత నేను తిరుమలకు వెళ్లాను. అక్కడ దర్శనం ముగించుకొని, ప్రసాదం తింటున్న సమయంలో నా మదిలో మెదిలిన టైటిల్ 'నమో వెంకటేశ'. అందుకే అందరికి ఆ టైటిల్ బాగా నచ్చింది. కథకు కూడా బాగా సరిపోయింది..అంటూ శ్రీను వైట్ల తన లేటెస్ట్ చిత్రం టైటిల్ ఎలా పుట్టిందో చెప్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలైంది. ఈ చిత్రం ప్రమేషన్ లో భాగంగా దర్శకుడు శ్రీను వైట్ల మీడియాతో మాట్లాడుతూ..'నమో వెంకటేశ' చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. అలాగే ఈ చిత్రం కథ తయారైన విధం చెబుతూ..వెంకటేష్‌తో సినిమా చేస్తే ఎలాంటి కథతో చేయాలనుకున్నానో అలాంటి కథతోనే 'నమో వెంకటేశ'ను తెరకెక్కించాను.
నా దర్శకత్వంలో వచ్చిన 'ఆనందం' చిత్రం చూసి ఆయన నన్ను అభినందించారు. అప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఓ చిత్రాన్ని చేయాలనుకున్నాం. అది ఇన్నాళ్లకు 'నమో వెంకటేశ'తో కార్యరూపం దాల్చింది. అలాగే నా ప్రతి చిత్రంలో కథా వస్తువు సీరియస్‌గా వున్నా దానిని వినోదాత్మకంగా తెరకెక్కించటానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అనేది యూనివర్శల్ యాక్సెప్టెన్స్ అనేది నా భావన. సమాజంలో వుండే రకరకాల వ్యక్తులను గమనిస్తుంటాను. వాళ్ళను ప్రేరణగా తీసుకుని నేను పాత్రలను సృష్టిస్తాను. అందులో మా రచయితల సహకారం కూడా ఎంతో వుంటుంది. ఇక కథానాయకుడి శారీరక భాష, ఆయన ఇమేజ్‌కు తగ్గట్టుగా కథ, కథనాలు తయారుచేసుకుంటాను అన్నారు.