ఏ పాత్ర సెట్ కాకనే ఆడ వేషం, ఎగిరిగంతేసిన మనోజ్

మొదట మోహన్‌బాబు కథానాయకుడిగా అనుకుని ఈ సినిమా ప్రారంభించామని, ఆ తరువాత ఒక్కొక్క పాత్రా చేరడంతో చివరికి మల్టీస్టారర్‌గా మారిందని ఆయన తెలిపారు. మొదట అనుకున్న సబ్జెక్టులో మనోజ్‌కు ఏ పాత్రా సెట్ కాలేదని, సడెన్‌గా స్ర్తి పాత్ర చేస్తే ఎలా వుంటుందనుకుని మనోజ్‌తో సంప్రదించామని, ఈ విషయం చెప్పగానే ఆయన ఎగిరి గంతేసి చేస్తానని చెప్పడంతో స్క్రిప్ట్ పూర్తిచేశామని అన్నారు. మోహని పాత్రే ఇప్పుడు హైలెట్‌గా మారడం, సంతోషంగా ఉందని దర్శకుడు చెప్పారు. మొదట ఈ చిత్రాన్ని మల్టీస్టారర్‌గా నిర్మించాలని అనుకోలేదు. ఒక్కొక్క పాత్ర చేరి అలా జరిగింది. సినిమా పరంగా మోహినీ పాత్ర ప్రేక్షకులకు నచ్చేలా చేయడం కత్తిమీద సాములాంటిది అని దర్శకుడు శ్రీవాస్ తెలిపారు.
మోహిని పాత్రలో కొంచెం తేడా జరిగినా, ప్రేక్షకులు తిరస్కరించారు అంటే ఇబ్బందుల్లో పడతామని ముందుగానే ఊహించి ఆ పాత్ర ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దామన్నారు. ఈ విషయంలో మంచు లక్ష్మి సహకారం మరువలేనిదని, సినిమాలో మోహిని ముగ్గు వేసే సీన్‌కోసం మనోజ్ చాలా కష్టపడ్డాడని ఆయన అన్నారు. ఎక్కువగా ఆహారం తీసుకుంటూ జిమ్‌కు వెళ్ళకుండా తన శరీరాన్ని వదులు చేయడంవల్ల అది సాధ్యమైందన్నారు.


Click it and Unblock the Notifications











