లక్కీ...ద్వితీయ విఘ్నం అధిగమించా: 'లక్ష్యం' శ్రీవాస్
"ప్రతి దర్శకుడికీ ద్వితీయ విఘ్నం ఉంటుందని సినిమా పరిశ్రమలో ఓ అభిప్రాయం ఉంది. అయితే నేను దాన్ని అధిగమించగలిగాను' అని దర్శకుడు శ్రీవాస్ అన్నారు. రామ్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మించిన 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా యూనిట్ సభ్యులు హైదరాబాద్ లోని పలు థియేటర్లను సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీవాస్ పై విధంగా స్పందించారు. ఇక శ్రీవాస్ మొదటి చిత్రం లక్ష్యం. గోపీచంద్, అనూష్క కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం మంచి హిట్ నమోదు చేసింది. ఇక రెండో చిత్రం 'రామ రామ కృష్ణ కృష్ణ' రిజల్ట్ తెలిసిందే. ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం హిట్టయిందంటూ దర్శకుడు అభివర్ణించటాన్ని ఫిల్మ్ సర్కిల్స్ లో విని నవ్వుకుంటున్నారు. అలాగే బాలకృష్ణ సూపర్ హిట్ బంగారు బుల్లోడు చిత్రాన్ని దగ్గర పెట్టుకుని ఈ చిత్రాన్ని తీసాడని కూడా రిలీజైన వెంటనే వినిపించింది.


Click it and Unblock the Notifications











