బాలయ్య స్వయంగా డైరెక్టర్ మొహానికి పూసారు (వీడియో)

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ బాలయ్య గంభీరంగా కనిపిస్తారు. అయితే యూనిట్ సభ్యులతో ఆయన ఎంత జోవియల్ గా ఉంటారో రుజువుచేసే వీడియో ఒకటి విడుదలైంది. దర్శకుడు శ్రీవాస్ పుట్టినరోజు వేడుక న్యూఢిల్లీలో ‘డిక్టేటర్' షూటింగ్ స్పాట్లో జరిగాయి. ఈ సందర్భంగా బాలయ్య స్వయంగా దర్శకుడి మొహానికి కేక్ పూరి విషెస్ తెలిపారు. అందుకు సంబందించిన వీడియోపై మీరూ ఓ లక్కేయండి.

Director Sriwass Birthday Celebrations at Dictator Shooting New Delhi, India

Posted by Manabalayya.com on Tuesday, November 24, 2015

‘డిక్టేటర్' వివరాల్లోకి వెళితే...
ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థతో కలిసి వేదాశ్వ క్రియేషన్స్ అసోసియేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు. మంచి మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన శ్రీవాస్ ఈ చిత్రాన్ని బాలకృష్ణ అభిమానులు, ఇతర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కథానుసారం మరో నాయికకు కూడా స్థానం ఉంది. ఈ పాత్రకు అక్షను ఎంపిక చేశామని శ్రీవాస్ తెలిపారు. 'రైడ్', 'కందిరీగ' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్ష కెరీర్ కి మంచి బ్రే్క్ ఇచ్చే విధంగా ఈ పాత్ర ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ముగ్గురు కథానాయికల పాత్రలు సినిమాకి కీలంగా నిలుస్తాయని శ్రీవాస్ తెలిపారు.

‘'ఇది పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే చిత్రమవుతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా స్టయిలిష్ లుక్ తో కనపడతారు. ఈరోస్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించడం ఆనందంగా ఉంది'' అని దర్శకుడు అంటున్నాడు.

రవికిషన్, షాయాజీ షిండే, నాజర్, పృథ్వి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయడు, డైలాగ్స్: ఎం.రత్నం, రచన: కోన వెంకట్, గోపీ మోహన్, రచనా సహకారం: శ్రీధర్ సీపాన, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి.

100వ సినిమా....
బాలయ్య త్వరలో తన 100వ సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటికే ‘సింహా', ‘లెజెండ్' లాంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. మూడోసారి ఈ ఇద్దరి కలయికలో హాట్రిక్ హిట్ వస్తుందని ఆశిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10, 2016న లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

100వ సినిమాకు ‘గాడ్ ఫాదర్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ టైటిల్ బాలయ్య ఇమేజ్ కు పర్ ఫెక్టుగా సూటయ్యే విధంగా ఉందని, దీన్నే ఫిక్స్ చేయాలని అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం బాలయ్య తన 99వ సినిమా ‘డిక్టేటర్' షూటింగులో ఉన్నారు. మరో వైపు బోయపాటి బన్నీతో ‘సరైనోడు' చేస్తున్నారు. ఇద్దరి ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ‘గాడ్ ఫాదర్' పట్టాలెక్కనుంది. ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X