పవన్ కళ్యాణ్ కోసం ఏడాది ఎదురుచూసిన రాజమౌళి.. సినిమా కోసం చర్చలు జరిగాయి.. కానీ..
టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం RRR సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా మారుతున్నాడు. సినిమాకు సంబంధించిన పనులన్నీ కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇక విడుదల చేయడమే తరువాయి భాగం. ఫైనల్ రన్ టైమ్ తో పాటు బిజినెస్ డీల్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యాయి. వచ్చే యేడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా రాజమౌళి గతంలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని అనుకున్నట్లు చెబుతూ కొన్నిసార్లు చర్చలు కూడా జరిగాయని గతాన్ని గుర్తు చేసుకున్నారు.

రాజమౌళితో సినిమా చేయాలని..
రాజమౌళి తో సినిమా చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా హీరోలు అయితే డేట్స్ ఎప్పుడు అడిగినా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అవసరం అయితే ముందుగా ఒప్పుకున్న సినిమాలను కూడా పక్కన పెట్టడానికి సిద్ధమవుతుంటారు. ఇక రాజమౌళి సినిమాలో ఓ చిన్న పాత్ర దొరికిన కూడా నేటి తరం యువ హీరోలు కూడా సిద్ధంగా ఉంటారు. స్టార్ హీరోలు అయితే ఎక్కడ కలిసిన సినిమా చేద్దామని ఆయనను అడుగుతూ ఉంటారు.

స్టార్స్ తో చేయడం ఇష్టం..
రాజమౌళి కూడా స్టార్ హీరోలందరితో సినిమాలు చేయాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటాడు. స్టార్ ఇమేజ్ అనేది సినిమాకు ఎంతగానో ప్లస్ అవుతుంది అని తనకు కూడా ఇండస్ట్రీలో అగ్రహీరోలతో వర్క్ చేయాలని ఉంటుందని చాలాసార్లు ఓపెన్ గానే తెలియజేశాడు. అయితే కొన్నిసార్లు ప్రాజెక్టులు అనుకున్నట్లుగా సెట్ అవ్వకపోతే ఎవరు ఏమి చేయలేరు అని కూడా తెలియజేశాడు. మహేష్ బాబుతో మొత్తానికి సినిమా చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.

మొదట విక్రమార్కుడు కథతో..
అయితే పవన్ కళ్యాణ్ తో కూడా రాజమౌళి ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో కొన్నిసార్లు రాజమౌళి పవన్ కళ్యాణ్ ను కలవడం జరిగింది. ముఖ్యంగా విక్రమార్కుడు సినిమా కథను మొదట పవన్ కళ్యాణ్ తో చేస్తే బాగుంటుంది అని ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా సలహా ఇచ్చాడు. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా నుంచి కొంత బ్రేక్ తీసుకోవడంతో ఆ ప్రాజెక్టును చేయలేకపోయాడు.

తప్పకుండా చేద్దాం..
ఇక మరి కొన్నాళ్ళకు పవన్ కళ్యాణ్ తో ఎలాగైనా ఒక సినిమా చేయాలని అనుకున్న రాజమౌళి ప్రత్యేకంగా కలవడంతో తప్పకుండా చేద్దాం అని ఫిక్స్ అయ్యారట. అయితే ఎలాంటి కథ కావాలని రాజమౌళి అడిగినప్పుడు అందుకు పవన్ కళ్యాణ్ మీకు ఇష్టమైన కథలు తీసుకురండి తప్పకుండా చేద్దాం అని సమాధానమిచ్చాడట. అయితే పవన్ మళ్లీ కబురు పెడతా అని చెప్పడంతో రాజమౌళి ఇతర సినిమాల పై ఫోకస్ పెట్టాడు.
Recommended Video

సాధ్యం కానట్లే..
అయితే ఏడాది పాటు రాజమౌళి పవన్ కళ్యాణ్ కాల్ కోసం ఎదురు చూశాడు. కానీ ఎంత వెయిట్ చేసినా కూడా ఆయన నుంచి సమాధానం రాకపోవడంతో ఆ తరువాత మగధీర ఈగ సినిమాల అనంతరం తన ఫార్మాట్ మొత్తం మారిపోయింది అని రాజమౌళి చెప్పాడు. బాహుబలి RRR అంటూ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్న ఒక విధంగా లోకల్ కమర్షియల్ సినిమాలను తీసే పరిస్థితులు లేడు.
ప్రస్తుతం తాను ఎక్కువ టైమ్ తీసుకుని పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే సమయం ఉండదు. అలాగే పవన్ కూడా పాలిటిక్స్ తో కూడా బిజీ అయ్యారు కాబట్టి చాలా వేగంగా సినిమాలను పూర్తి చేస్తున్నట్లు. వివరణ ఇచ్చాడు. అయితే రాజమౌళి చెప్పిన దాన్ని బట్టి ఈ కాంబినేషన్ అనేది తెరకెక్కడం ఇప్పట్లో సాధ్యం కాదు అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











