RRR ఒక్క రోజు షూటింగ్‌కు ఖర్చు ఎంతో తెలుసా? .. ఆ పరిస్థితుల్లో హీరోలను వదలని జక్కన్న
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమా మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన ఈ సినిమా రియల్ ఫ్రీడమ్ ఫైటర్స్ క్యారెక్టర్స్ ఆధారంగా తెరకెక్కింది. రియల్ క్యారెక్టర్ ను తీసుకుని కంప్లీట్గా ఫిక్షన్ కథతో సినిమాను తెరకెక్కించినట్లుగా దర్శకుడు మొదటినుంచి చెప్పుకొస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయాలను కూడా దర్శకుడు ఓపెన్ గానే ఇంటర్వ్యూలలో చెప్పేస్తున్నాడు. ఇక రీసెంట్ గా రాజమౌళి హీరోలు ఎన్ని బాధలు పడిన కూడా అవసరమైన సమయంలో వారికి ఏమాత్రం బ్రేక్ ఇవ్వలేదట. అందుకు కారణం కూడా చెప్పిన రాజమౌళి ఒక్క రోజు షూటింగ్ కు ఎంత అవుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేశాడు.

100కోట్లు ఈజిగానే..
బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఎవరూ ఊహించని విధంగా మెగా నందమూరి హీరోలతో సినిమా చేయడం ఎంతో ఆసక్తిని కలిగించింది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని మొదటిరోజే ఈజీగా 100కోట్లు కలెక్షన్స్ రావచ్చునని కూడా బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా అత్యధిక స్థాయిలో విడుదల అవుతోంది.

హీరోలకు రెస్ట్ ఇవ్వకుండా..
రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్ర లో కనిపిస్తూ ఉండగా కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఆకట్టుకోబోతున్నాడు తప్పకుండా ఈ రెండు పాత్రలు కూడా నెవర్ బిఫోర్ అనేలా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి అని రాజమౌళి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకొస్తున్నాడు. అయితే ఒకానొక సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా పలు అనారోగ్య కారణాలతో షూటింగ్ బ్రేక్ తీసుకుందాము అని ఆలోచన చేసినప్పటికీ కూడా రాజమౌళి ఏ మాత్రం రెస్ట్ ఇవ్వలేదట.

తెలియని విషయాలు...
ఇటీవల రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు కలిసి ఒక ప్రత్యేకమైన కామెడీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆఫ్ స్క్రీన్ చాలా సరదాగా నార్మల్ గా మాట్లాడుతున్నట్లు ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ వీడియోలో దాదాపు ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను కూడా చెప్పారు.

రాజమౌళి మీద పట్టరాని కోపం
అయితే తనమీద ఎప్పుడైనా పట్టరాని కోపం వచ్చిందా అని రాజమౌళి ఇద్దరు హీరోలను అడిగాడు. అందుకు ముందుగా రామ్ చరణ్ ఒకసారి తనకు తీవ్రంగా తలనొప్పి జ్వరం వచ్చింది అని ఆ కారణం తో కాస్త బ్రేక్ ఇస్తారు అనుకుంటే రాజమౌళికి ఏమాత్రం బ్రేక్ ఇవ్వలేదు అని ఇప్పుడు ప్రస్తుతం చాలామంది షూటింగ్కు రెడీ గా ఉన్నారు అని దాదాపు వెయ్యి మంది ఒక షాట్ ప్లాన్ చేసినట్లుగా కారణం చెప్పాడని చరణ్ తెలిపాడు.

తారక్ రియాక్షన్
ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక రోప్ సీన్ చేసేటప్పుడు చాలా అలసిపోయినట్లుగా కనిపించాడట. అయితే ఆ కష్టం చూసి రాజమౌళి కాస్త బ్రేక్ ఇస్తారేమో ఏదైనా సానుభూతి అయినా చూపిస్తారేమో అని జూనియర్ ఎన్టీఆర్ చాలాసార్లు అనుకున్నాడట. కానీ రాజమౌళి చాలాసార్లు అలా ఏమీ అనుకోకుండా ఒక్కసారి మాత్రం బాగా ఇబ్బంది పెట్టినప్పుడు ఒక గంట ముందు వెళ్ళిపోతావా అని అన్నప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది ఎన్టీఆర్ సరదాగా చెప్పుకొచ్చాడు.

ఒక్క రోజుకు ఎంత ఖర్చయ్యిందంటే?
అయితే హీరోల బాధలు చెప్పినప్పుడు రాజమౌళి కూడా తనదైన శైలిలో ఒక వివరణ ఇచ్చాడు.. ఇప్పుడు నేను సానుభూతి చూపిస్తే ప్లాన్ చేసుకున్న షూటింగ్ షెడ్యూల్ మొత్తం క్యాన్సల్ చేసుకోవాల్సి ఉంటుంది. RRR సినిమా కోసం దాదాపు ఒక్క రోజుకు 50 లక్షల వరకు ఖర్చు చేశాము. ప్రతి షాట్ కు దాదాపు ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు నేను సానుభూతి చూపిస్తే ఆ డబ్బు వృధా అవుతుంది దాంతో నాలో ఏదో టెన్షన్ పెరిగిపోతుంది. అందుకే బ్రేక్ ఇవ్వలేదు.. అని రాజమౌళి తెలియజేశాడు.


Click it and Unblock the Notifications











