సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ పై రాజమౌళి క్లారిటీ.. ఇలాంటి సమయంలోనే ఏకమవ్వాలి అంటూ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ ఫైట్ అనేది ప్రతిసారి మార్కెట్ వాల్యూని ఒక్కసారిగా పెంచేస్తూంది. కంటెంట్ బావుంటే పోటీ తీవ్రత ఎంత ఉన్నా కూడా సినిమాలు సక్సెస్ అవుతాయని చాలాసార్లు రుజువయ్యింది. హీరోల కంటే అభిమానులే ఈ పోటీలో ఎక్కువగా సందడి చేస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైన తర్వాత బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా ఎప్పటికప్పుడు హీరోల స్టార్ హోదాను మార్చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం సంక్రాంతి బాక్సాఫీస్ పై పైనే అందరికీ ఫోకస్ ఎక్కువగా ఉంది. వచ్చే ఏడాది పొంగల్ బరిలో ఎవరు భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ బాక్స్ ఆఫీసు పై దర్శకుడు రాజమౌళి ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చాడు.

భీమ్లా నాయక్ ఫిక్స్ అయ్యాడు
మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే భీమ్లా నాయక్ సినిమాతో జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మరోసారి బలంగా క్లారిటీ ఇచ్చేశాడు. మొన్నటి వరకు చిత్ర నిర్మాతల మధ్య అనేక రకాల చర్చలు జరిగాయి. భీమ్లా నాయక్ సంక్రాంతి పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్లు అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పులు లేవని మరొకసారి చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటన ఇచ్చింది.

పోటీగా ఉన్నప్పటికీ..
భీమ్లా నాయక్ సంక్రాంతికి తప్పకుండా వస్తుందని తెలియడంతో బాక్సాఫిస్ ఫైట్ మరింత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అందరికంటే ముందుగా సంక్రాంతి భరిలో రాజమౌళి RRR సినిమా నిలవనుంది. రామ్ చరణ్ తేజ్ - జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తప్పకుండా ఈ మూవీ బాక్సాఫీస్ పాత రికార్డులను బ్రేక్ చేస్తుందని ఈజీగా అర్ధమవుతుంది.

కఠినమైన పరిస్థితి
RRR కు డిమాండ్ ఏ స్థాయిలో ఉన్నా కూడా తెలుగులో కొంత కలెక్షన్స్ పై ప్రభావం తప్పదని తెలుస్తోంది. ఎందుకంటే జనవరి 12వ తేదీన పవన్ కళ్యాణ్ - రానా భీమ్లా నాయక్ భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే అందుకుంటుంది. ఈ సినిమాపై అంచనాలు గట్టుగానే ఉన్నాయి. దానికి తోడు జనవరి 14న రాధేశ్యామ్ రానుంది. కాబట్టి వారం రోజులు తరువాత RRR సినిమాకి కఠిన పరిస్థితి ఎదురు కానుంది.
Recommended Video

బాక్సాఫీస్ పోటీ పై రాజమౌళి కామెంట్స్
ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ బాక్సాఫీస్ పోటీపై ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. కేవలం RRR రాధేశ్యామ్ మాత్రమే కాకుండా అన్ని సినిమాలు గుడ్ కంటెంట్ తో రావాలని కోరుకుంటున్నాను. ఆడియెన్స్ అందరూ కూడా హ్యాపీగా సినిమాలు చూడాలి. టికెట్స్ కూడా బాగా అమ్ముడవ్వాలి. ఇది మన అందరికి చాలా ముఖ్యం. ఈసమయంలో సినిమాలు సక్సెస్ అయ్యే విధంగా అందరం ఏకమవ్వాలని, పోటీగా కాకుండా ఇండస్ట్రీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా ముందుకి సాగాలని రాజమౌళి వివరణ ఇచ్చారు. మరి ఆయన అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. అలాగే బాక్సాఫీస్ పోటీలో బంగార్రాజు సినిమా కూడా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











