కథ ఫైనల్ అవ్వకముందే విదేశాలకు వెళుతున్న రాజమౌళి, మహేష్ బాబు.. ఎందుకంటే.. ఫొటోస్ వైరల్!

దర్శకధీరుడు రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. RRR కంటే భారీ స్థాయిలో ఈ సినిమా ఉంటుందని ఇది వరకే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. తొలిసారి ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇక ఈ సినిమా పనులను త్వరలోనే మొదలు పెట్టాలని రాజమౌళి ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చాడు. అయితే రీసెంట్ గా రాజమౌళి అలాగే మహేష్ బాబు ఇద్దరూ కూడా ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. ఎక్కడికి వెళ్తున్నారు అనే వివరాల్లోకి వెళితే...

బిగ్గెస్ట్ హిట్

బిగ్గెస్ట్ హిట్


రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరితో కూడా మొదటిసారి RRR అనే ఒక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించిన రాజమౌళి మొత్తానికి మరో బాక్సాఫీస్ హిట్ అయితే సొంతం చేసుకున్నాడు. సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1,100 కోట్ల అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. పెట్టిన పెట్టుబడికి నిర్మాతకి మంచి లాభాలు వచ్చినట్లు సమాచారం.

RRR కంటే హై రేంజ్ లో..

RRR కంటే హై రేంజ్ లో..

అయితే ఈ సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు కూడా రాజమౌళి తదుపరి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ఎలా ఉంటుందా అని.. అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ సినిమా స్క్రిప్ట్ విషయంలో అయితే రాజమౌళి ఇంకా ఫైనల్ నిర్ణయానికి రాలేదు. సినిమా అయితే తప్పకుండా RRR కంటే హై రేంజ్ లోనే ఉంటుంది అని రచయిత విజయేంద్రప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.

ఇంకా ఫైనల్ కథ సెట్టవ్వలేదు

ఇంకా ఫైనల్ కథ సెట్టవ్వలేదు

రాజమౌళి మహేష్ బాబు సినిమాకు సంబంధించిన కథ విషయంలో ఇంకా రాజమౌళి ఫైనల్ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. రచయిత కే.విజయేంద్రప్రసాద్ చెప్పిన దాన్ని బట్టి ఆ సినిమా ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో ఉంటుంది అని తెలుస్తోంది. కానీ ఫైనల్ కథ విషయంలో కూడా ఇంకా రాజమౌళి తుది నిర్ణయానికి రాలేదని చెప్పారు. వీలైనంతవరకూ మహేష్ బాబును గతంలో ఎప్పుడో చూపించని విధంగా తన సినిమాలో చూపించాలని రాజమౌళి ఆలోచిస్తున్నట్లు సమాచారం.

విదేశాలకు మహేష్, రాజమౌళి

విదేశాలకు మహేష్, రాజమౌళి


ఇక రాజమౌళి ఇటీవల ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ గా మారాయి. అంతే కాకుండా మహేష్ బాబు కూడా ప్రత్యేకంగా విదేశాలకు వెళుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కలిసి వెళుతున్నారు అని.. కథ చర్చల్లో భాగంగానే విదేశాలకు వెళ్లి అక్కడ కొన్ని రోజుల పాటు సినిమా గురించి ఆలోచించి ఇండియాకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.

 ఎందుకు వెళ్లారంటే..

ఎందుకు వెళ్లారంటే..


అయితే నిజానికి రాజమౌళి మహేష్ బాబు ఇద్దరూ కలిసి వెళ్ళలేదు. మొన్నటివరకు వారి సినిమాలతో బిజీగా ఉండటం వలన ప్రస్తుతం కుటుంబంతో కలిసి హాలిడేస్ లో ఎంజాయ్ చేయాలి అని విదేశాలకు వెళుతున్నారు. RRR సినిమా కోసం దాదాపు మూడేళ్లు నిర్విరామంగా కష్టపడిన రాజమౌళి ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకుని దుబాయ్ కు ఫ్యామిలీతో కలిసి వెళ్లడం జరిగింది. అదే తరహాలో మహేష్ బాబు కూడా సర్కారు వారి పాట సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇచ్చి తన ఫ్యామిలీ తో కలిసి మరొక దేశానికి వెళుతున్నట్లు సమాచారం. వీరిద్దరూ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి వారి సినిమాకు సంబంధించిన పూర్తి ప్రణాళికను సిద్ధం చేసుకొనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X