twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జగన్‌తో మీటింగ్.. రాజమౌళికి చేదు అనుభవం.. అందుకు వ్యతిరేకం అంటూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు!

    |

    టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR సినిమా బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బడ్జెట్ సినిమా కావడంతో అనేక సార్లు కరోనా కారణంగా వాయిదా వేసుకుంటూ వచ్చిన ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఫైనల్ గా మార్చి 25వ తేదీన అన్నీ అనుకూలంగా ఉన్న సమయంలోనే విడుదల చేస్తున్నారు.

    ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు అదనపు షోలకు అనుమతి లేకపోవడంతో సినిమా బిజినెస్ ను కూడా కాస్త దెబ్బతీసే అవకాశం ఉంది. ఇక దర్శకుడు రాజమౌళి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలవడం జరిగింది. అయితే కలిసిన కొద్దిసేపటికే రాజమౌళికి చేదు అనుభవం ఏర్పడడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

    రాజమౌళి టెన్షన్..

    రాజమౌళి టెన్షన్..

    దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ RRR ఈనెల అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతుంది. అయితే భారీ బడ్జెట్ సినిమా కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే సినిమాను విడుదల చేయాలని దాదాపు ఆరు సార్లు ఈ సినిమాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు తక్కువగా ఉండడంతో దర్శకుడు రాజమౌళి లో కొంత టెన్షన్ నెలకొంది.

    హామీ ఇచ్చారని అనుకుంటే..

    హామీ ఇచ్చారని అనుకుంటే..

    ఇంతకుముందే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి నేతృత్వంలో రాజమౌళి, మహేష్, బాబు కొరటాల శివ, ప్రభాస్ ఇలా అందరూ ప్రత్యేకంగా కలుసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇండస్ట్రీకి అన్నీ అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని కూడా ఏపీ ప్రభుత్వం నుంచి ఒక హామీ అయితే వచ్చింది.

    దీంతో పెద్ద సినిమాలకు అదనపు షోలో అలాగే టికెట్ల రేట్లు కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది అని పెద్ద సినిమా నిర్మాతలు సంతోషించారు. కానీ అలాంటిదేమీ లేదు అని రాధే శ్యామ్ సినిమాతో చాలా ఈజీగా అర్థమైపోయింది.

    వైఎస్ జగన్ తో రాజమౌళి మీటింగ్

    వైఎస్ జగన్ తో రాజమౌళి మీటింగ్

    ఇక ఇప్పటికే రాధే శ్యామ్ సినిమాకు ఆంధ్రప్రదేశ్లో గట్టిగానే దెబ్బ పడింది. అసలే ఆ సినిమాకు నెగిటివ్ టాక్ రావడం అలాగే బెన్ఫిట్ షో లకు అనుమతులు ఇవ్వకపోవడం అదనంగా టికెట్లు రేట్లు పెంచుకోనివ్వకపోవడంపై కూడా పెద్ద దెబ్బ పడింది. ఇక ఆ ప్రభావం సినిమాపై పడకూడదు అని దర్శకుడు రాజమౌళి సోమవారం రోజు విజయవాడలో వైఎస్ జగన్ ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో నిర్మాత డివివి దానయ్య కూడా పాల్గొనడం జరిగింది.

    రాజమౌళి రియాక్షన్

    రాజమౌళి రియాక్షన్

    అయితే ఆ మీటింగ్ తర్వాత రాజమౌళి మీడియా ముందుకు వచ్చి జగన్ మోహన్ రెడ్డి గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అని పెద్ద సినిమా బడ్జెట్ కాబట్టి అవసరమైనంత వరకు కావాల్సింది చేస్తామని ఒక్కముక్కలో చెప్పేశారు. ఇక బెనిఫిట్ షో లకు అనుమతులు ఇచ్చారా అని మీడియా సభ్యులు అడిగినప్పటికీ రాజమౌళి ఆ విషయంపై పెద్దగా స్పందించకుండా వారి నుంచి అనువైన సమాధానం వస్తుంది అని ఆశిస్తున్నట్లు గా ఆ మ్యాటర్ ని ముగించేశాడు.

    షాక్ ఇచ్చిన పేర్ని నాని

    షాక్ ఇచ్చిన పేర్ని నాని

    ఇక రాజమౌళి రియాక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికి ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఎవరూ ఊహించని విధంగా స్పందించారు. రాజమౌళి, దానయ్య ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కలుసుకోవడానికి ముఖ్య కారణం టిక్కెట్ల రేట్లపై తీసుకొచ్చిన కొత్త జీవో విషయంలో సీఎంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడానికే అని వివరణ ఇచ్చారు. ఇక ఈ వేడుకలో తాను పాల్గొన లేదు అంటూ టికెట్ల రేట్ల విషయంలో అయితే రాజమౌళి సినిమాకు ఒక రేటు మరొక సినిమాకు ఇంకో రేటు ఉండదు అని తేల్చి చెప్పేశారు.

    Recommended Video

    RRR Update : SS Rajamouli's New Strategy To Release RRR | Filmibeat Telugu
    అందుకు వ్యతిరేకం..

    అందుకు వ్యతిరేకం..

    అంతేకాకుండా పేర్ని నాని బెనిఫిట్ షో లకు మా ప్రభుత్వం వ్యతిరేకమంటూ.. ఐదో షో వేయాల‌నుకుంటే చిన్న సినిమాకు మరొక రకంగా అవకాశం క‌ల్పించాల‌ని, నిబంధ‌న‌ల ప్రకారమే టికెట్ రేట్ల పెంపు ఉంటుంద‌ని అన్నారు. ఇక ఈ విధంగా మంత్రి పేర్ని నాని వివరణ ఇవ్వగానే RRR సినిమాకు బెనిఫిట్ షోలు ఉంటాయనే ఆశలు అభిమానుల్లో మాయమైయ్యాయి. ఫైనల్ గా రాజమౌళి సీఎంతో ఎంతో ఆశగా మాట్లాడినప్పటికి చేదు అనుభవమే ఏర్పడినట్లు ఉందని అర్ధమవుతోంది.

    English summary
    Director SS rajamouli and perni nani reaction after ap cm meeting..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X