RRR: ఒకేసారి దూసుకొచ్చిన ఫ్యాన్స్.. జనాల నుంచి తప్పించుకోలేక ఇబ్బంది పడిన హీరోలు రాజమౌళి!

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RRR మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం గ్యాప్ లేకుండా పాల్గొంటున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ప్రత్యేకమైన ఈవెంట్ దుబాయిలో జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కర్ణాటకలో కూడా భారీ స్థాయిలో ఈవెంట్ ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే గత రాత్రి బెంగుళూరు కు చేరుకున్న చిత్ర యూనిట్ సభ్యులకు జనాల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురు అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే...

అందరి ఫోకస్ ఆ ఈవెంట్ పైనే

అందరి ఫోకస్ ఆ ఈవెంట్ పైనే

జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన RRR సినిమా మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెబుతున్నారు. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ కర్ణాటక లో జరుగుతున్న బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై పడింది.

హీరోల గ్రాండ్ ఎంట్రీ

హీరోల గ్రాండ్ ఎంట్రీ

కర్ణాటకలోని చిక్బల్లాపూర్ లో జరగనున్న వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక అతిథిగా రాబోతున్నారు. వేడుకలో హీరోల స్పెషల్ ఎత్రి కూడా హైలెట్ గా నిలుస్తుంది అని సమాచారం. సినిమా వేడుక కోసం తెలుగు రాష్ట్రాల నుంచి మెగా నందమూరి అభిమానులతో పాటు కర్ణాటక సంబంధించిన సినీ అభిమానులు కూడా భారీ స్థాయిలో రాబోతున్నారు.
ఈ వేడుకలో హీరోలు ఎలాంటి విషయాలపై మాట్లాడుతారు అనేది కూడా హాట్బ్ టాపిక్ గా మారింది.

ఎగబడిన ఫ్యాన్స్

ఎగబడిన ఫ్యాన్స్

అయితే రీసెంట్ గా దుబాయ్ లో ఒక ఈవెంట్ను పూర్తి చేసుకున్న RRR యూనిట్ సభ్యులు గత రాత్రి కర్ణాటక కు రావడం జరిగింది. అయితే బెంగళూరులోని ఎయిర్ పోర్ట్ లో చిత్ర యూనిట్ సభ్యులకు కొంత చేదు అనుభవం ఎదురయింది. ఒక్కసారిగా అభిమానులు రావడంతో వారికి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లడానికి సరైన దారి కూడా దొరకలేదు. ముందుగా రామ్ చరణ్ అభిమానులు జై రామ్ చరణ్ స్లొగన్స్ చెబుతూ దూసుకు వచ్చారు. ఆ తర్వాత రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది.

 ఎంత కంట్రోల్ చేసినా..

ఎంత కంట్రోల్ చేసినా..

వారితో పాటు ఉన్న సెక్యూరిటీ జనాలను ఎంత కంట్రోల్ చేసినా కూడా కంట్రోల్ అవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక రామ్ చరణ్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కూడా అక్కడి నుంచి చాలా స్పీడ్ గా వెళ్లిపోవడం జరిగింది. ప్రమోషన్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని రాజమౌళి హీరోలు కూడా ప్రతి వేడుకకు తీసుకెళ్తున్నాడు. అలాగే ప్రతి ఇంటర్వ్యూల్లోనూ ఇద్దరిని అనేక రకాల ప్రశ్నలు అడుగుతున్నారు.

ప్రమోషన్స్ తో పాజిటివ్ వైబ్రేషన్స్

ప్రమోషన్స్ తో పాజిటివ్ వైబ్రేషన్స్

మొత్తానికి అయితే సినిమా ప్రమోషన్స్ చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. తప్పకుండా ఈ సినిమా మొదటిరోజు ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుందని బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. మరి సినిమా బాలీవుడ్ లోను ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X