Oscars 2023: నాటు నాటుకు అవార్డు రాగానే.. RRR దర్శకుడు రాజమౌళి ఏం చేశారంటే

ఆస్కార్ 2023 అకాడమీ అవార్డ్స్ లో RRR సినిమా నాటు నాటు పాటకు అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక అవార్డ్స్ వేడుకలో RRR యూనిట్ హ్యాపీ మూమెంట్స్ కు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అవార్డు ప్రకటించగానే అసలు రాజమౌళి ఏం చేశాడు అనే వివరాల్లోకి వెళితే..

ఊహించనివిధంగా..

ఊహించనివిధంగా..

SS రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ RRR సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. RRR సినిమా లోని నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కుతుంది అని ఎవరు ఊహించలేదు. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కు ఇప్పుడు హాలీవుడ్ లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.

చాలా గొప్ప విషయం

చాలా గొప్ప విషయం

ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లినా చాలు అని అనుకున్న సమయంలో RRR సినిమా పాటకు ఏకంగా అకాడమీ అవార్డు దక్కడం చాలా గొప్ప విషయం. గత కొన్ని నెలలుగా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా గట్టిగానే జరిగాయి. రామ్ చరణ్ హాలీవుడ్ మీడియాతో నిత్యం ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమాకు మరింత హైప్ తీసుకు వచ్చాడు.

టీమ్ వర్క్

ఒకవిధంగా సినిమాకు ఈ స్థాయిలో క్రేజ్ రావడానికి అందరు కారణం అని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజమౌళి ప్లానింగ్ మేకింగ్ విధానంతో కీరవాణి మ్యూజిక్ అందించడం, చంద్రబోస్ లిరిక్స్ రాయడం అలాగే ప్రేమ్ రక్షిత్ అద్భుతమైన కొరియోగ్రఫీ చేయడం బాగా కలిసి వచ్చింది. ఇక సింగర్స్ హీరోలు వారి ప్రాణం పెట్టి వారి పనిని పూర్తి చేశారు.

అవార్డు రాగానే..

ఇక 2023 ఆస్కార్ వేదికపై నాటు నాటు అనే పాట ఆస్కార్ గెలిచిందని ఎనౌన్స్ చేయగానే ఒక్కసారిగా రాజమౌళితో పాటు ఆయన పక్కన ఉన్న సతీమణి రామా, కొడుకు కార్తికేయ అందరూ కూడా కట్టలు తెచ్చుకునే ఆనందంతో కనిపించారు. రాజమౌళి చిన్న పిల్లడిలా జోష్ తో కనిపించాడు.

ఎమోషనల్ మూమెంట్

ఎమోషనల్ మూమెంట్

అయితే ఆ వేడుకలో కీరవాణి సతీమణి శ్రీవల్లి కూడా పాల్గొన్నారు. ఇక అవార్డు రాగానే ఆమె రాజమౌళి దగ్గరికి వెళ్లారు. రాజమౌళి వదినను ఒక తల్లిలా భావిస్తాడు. ఎప్పటి నుంచో ఆమెను అమ్మా అనే పిలవడం స్టార్ట్ చేశాడట. ఇక ఆమె వచ్చి రాజమౌళిని అలాగే రామను ఒక్కసారిగా కౌగిలించుకుని ఎమోషనల్ అయ్యారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ సినిమా.. ఎలా ఉంటుందో?

ఆ సినిమా.. ఎలా ఉంటుందో?

రాజమౌళి తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా ఇదే ఏడాది చివరలో స్టార్ట్ కావచ్చని సమాచారం. RRR సినిమాతో ఆస్కార్ వరకు వెళ్లిన రాజమౌళి తప్పకుండా.మహేష్ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో నిలబెడతాడు అని తెలుస్తోంది. ఇక సినిమాకు కీరవాణి ఇంకా ఏ రేంజ్ లో మ్యూజిక్ అందిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X