SS Rajamouli : మేడ్ ఇన్ ఇండియా... జక్కన్న బిగ్ అనౌన్స్‌మెంట్ ఇదే!
ఎస్ ఎస్ రాజమౌళి... తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్త గుర్తింపును కైవసం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు జక్కన్న నుంచి బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అదేదో రాజమౌళి మహేశ్ సినిమా కాదు. మేడ్ ఇన్ ఇండియా అంటూ... ఓ సినిమాను రాజమౌళి ప్రజెంట్ చేస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే...
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు తెలియజేశాడు రాజమౌళి. శాంతినివాసం అనే సీరియల్ డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టిన ఆయన... వరల్డ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచారు. ఆయన సినిమాలో హీరో హీరోయిన్స్ కంటే... జస్ట్ రాజమౌళి సినిమా అంటే వందల కోట్ల కలెక్షన్స్ వచ్చేస్తాయి.

ఇండియన్ డైరెక్టర్స్ లో ఏ దర్శకుడికి కూడా రాజమౌళికి ఉన్న క్రేజ్ లేదు.ఆస్కార్ అవార్డుని ఇండియాకి తీసుకోని వచ్చిన రాజమౌళి... ఇప్పుడు మరో ప్రాజెక్టుతో రాబోతున్నాడు. అది మహేశ్ బాబు ప్రాజెక్టు అనుకుంటే పొరపాటే. 'మేడ్ ఇన్ ఇండియా' అనే టైటిల్ తో పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రానున్నాడు జక్కన్న.
మేడ్ ఇన్ ఇండియా అంటే... ఈ సినిమా ఎప్పుడు ప్రకటించాడు అనుకుంటున్నారా... ఇది రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా కాదు రాజమౌళి ప్రెజెంట్ చేస్తున్న సినిమా. యమదొంగ సినిమాని తన సొంత బ్యానర్ విశ్వామిత్ర క్రియేషన్స్ పై ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన రాజమౌళి... ఆ తర్వాత మళ్లీ ప్రొడిక్షన్ వైపు వెళ్లలేదు. ఇటీవల బాలీవుడ్ లో తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన రాజమౌళి... ఇప్పుడు మరో సినిమాని పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి తీసుకోని వస్తున్నాడు.

అసలు ఇండియన్ సినిమా ఎక్కడ పుట్టింది? దాని ఆరిజిన్ ఏంటి? అనే కథతో ఇండియన్ సినిమా బయోపిక్ గా మేడ్ ఇన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. నితిన్ కక్కర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాని కార్తికేయ, వరుణ్ గుప్తా కలిసి నిర్మించనున్నారు. ఇప్పుడు ఈ సినిమాను రాజమౌళి ప్రజెంట్ చేస్తున్నాడు. మరి ఇండియన్ సినిమా బయోపిక్ ని వరల్డ్ ఆడియన్స్ ముందుకి ఎలా ముందుకు తీసుకువెళ్తాడో చూడాలి.
ఆ విషయం పక్కన పెడితే మహేశ్ రాజమౌళి సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. గుంటురుకారం సినిమాతో బిజీగా ఉన్న మహేశ్.. ఆ తర్వాత రాజమౌళి ప్రాజెక్టులో భాగం కానున్నాడు. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కనుంది. ఇప్పటికే మహేశ్ మూవీ కోసం కథను సిద్ధం చేస్తున్నాడు రాజమౌళి తండ్రి విజయేంద్ర వర్మ. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం కానుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











