మహేష్ బాబు ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించే విషయం చెప్పిన రాజమౌళి.. మూవీ అలా ఉంటుందట!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకధీరుడు రాజమౌళి మరో బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి చర్చలతో కొనసాగుతున్న ఈ ప్రాజెక్ట్ పై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇదివరకే విజయేంద్ర ప్రసాద్ ఆ కాన్సెప్ట్ పై ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ దర్శకుడు రాజమౌళి మాత్రం ఆ విషయంలో సరైన తరహాలో స్పందించడం లేదు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్న ఎవరూ ఊహించని విధంగా మహేష్ బాబు అభిమానులకు పూనకాలు తెప్పించే విషయాన్ని చెప్పాడు. ఆ ఒక్క మాటతో ఇప్పుడు ఆ ప్రాజెక్టు పై అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

ఎప్పుడైనా సిద్ధమే..
సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని దర్శకుడు రాజమౌళి గత కొన్ని ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మధ్యలో కొన్ని సార్లు చర్చలు జరిగినప్పటికీ కూడా ఎందుకో ప్రాజెక్ట్ అయితే సెట్ అవ్వలేదు. మహేష్ బాబు కూడా రాజమౌళి ఎప్పుడు అడిగినా కూడా సినిమా చేసేందుకు సిద్ధంగా ఉంటాను అని చాలాసార్లు వివరణ ఇచ్చాడు. మొత్తానికి ఈ ప్రాజెక్టుపై గతేడాది క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అలా ఉంటుందని..
రాజమౌళి మహేష్ బాబు కలయిక అంటే అభిమానులలో అంచనాలు అయితే మామూలుగా ఉండవు అని చెప్పవచ్చు. ఇక వీరి ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనే విషయంలో కూడా ముందుగానే అనేకరకాల రూమర్లు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ మేయిన్ ప్లాట్ సిద్ధం అయింది అని అన్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఆ సినిమా ఉంటుంది అని సరి కొత్త అడ్వెంచర్ ఫీలింగా తెరకెక్కుతుందిని కూడా చెప్పడంతో అప్పుడే అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి.

పెద్దగా ఆలోచించను అని..
పూర్తి స్క్రిప్ట్ అయితే ఇంకా దర్శకుడు రాజమౌళి ఫైనల్ చేయలేదని కూడా విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. ఇక ప్రస్తుతం RRR కు సంబంధించిన ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్న రాజమౌళి ప్రతి ఇంటర్వ్యూలో కూడా మహేష్ బాబుకు సినిమాకు సంబంధించిన ఏదో ఒక ప్రస్తావన ఎదురవుతుంది. ఇక రాజమౌళి ఆ సినిమా గురించి మాట్లాడినట్లే మాట్లాడుతూ పెద్దగా ఎలాంటి విషయాన్ని కూడా చెప్పడం లేదు. ఒక సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది అంటే తన తదుపరి సినిమా గురించి పెద్దగా ఆలోచించను అని, ఏదైనా సరే RRR విడుదలైన తర్వాత ఇదివరకే చెప్పాడు.

ఆ సినిమాల కంటే భారీగా..
ఇక రీసెంట్ గా ఒక బాలీవుడ్ మీడియా విలేఖరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మహేష్ బాబు అభిమానులకు మంచి కిక్ ఇచ్చే ఒక మాట అయితే చెప్పాడు. మహేష్ బాబుతో చేయబోయే సినిమా మాత్రం మామూలుగా ఉండదు అని ఇప్పుడు రాబోతున్న RRR అలాగే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన బాహుబలి కంటే కూడా భారీ స్థాయిలో ఉంటుంది అని బలమైన స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. దీన్నిబట్టి సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.
Recommended Video


విడుదల ఎప్పుడంటే?
ఇక RRR సినిమా విడుదలైన తర్వాత దర్శకుడు రాజమౌళి తన కుటుంబ సభ్యులతో కలిసి హాలిడేస్ కు వెళ్ళనున్నాడు. ఇక హాలిడేస్ అనంతరం మహేష్ బాబుకు సంబంధించిన ప్రాజెక్టు పనులను మొదలు పెట్టనున్న రాజమౌళి పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసుకున్న తరువాతనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక ఆ సినిమాను వచ్చే ఏడాది చివరలో లేదా 2024 మొదట్లోనే విడుదల చేయవచ్చు అని సమాచారం.


Click it and Unblock the Notifications











